ప్రవహించే నదిగా కొత్త ఒరవడిలో కత్తి పద్మారావుగారి వ్యక్తిత్వ నిర్మాణ రచనా విధానం సాగింది. ఈ గ్రంథం 'ప్రపంచ విజేతలు వ్యక్తిత్వ నిర్మాణం' 7వ భాగం. ఈ సిరీస్లో కత్తి పద్మారావుగారు ప్రపంచంలో విభిన్న రంగాల్లో సుప్రసిద్ధులైన వారి జీవితాలను, ఎదుగుదల క్రమాన్ని వివరించారు, విశ్లేషించారు. బాల్యం నుండి వేసిన ప్రభావాల్లో చుట్టూ పరిస్థితులు ఎలా మనిషిని తీర్చిదిద్దుతాయో అలా వ్యక్తి యొక్క నిర్మాణం ఎలా సాగుతూ వచ్చిందో వారి జీవిత కథనంతో పాటు చక్కగా విశ్లేషించారు. ఈ నమూనా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం గురించి చెప్పడం అరుదు. తత్వశాస్త్ర చరిత్రలో ఇలాంటి కృషి కనపడుతుంది. చారిత్రక వ్యక్తుల చరిత్ర పరిచయంలో ఈ పద్ధతి కనపడుతుంది. | సామాజిక శాస్త్రవేత్తల జీవిత కథనాల విషయంలో ఈ పద్ధతి కనపడుతుంది. జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర రచనలో ఈ పద్ధతి కనపడుతుంది. అలా కత్తి పద్మారావుగారు అంబేద్కర్ జీవిత చరిత్రని, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రలను ఇదివరకే అందించారు. అవి పలు ముద్రణలు పొందాయి. కత్తి పద్మారావుగారు ఒక ప్రణాళిక ప్రకారం ఈ రచనలకు పూనుకున్నారు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ ఈ రచనా విధానాన్ని గాంధీ, రెనడే, జిన్నాల నుంచి అవలంభించారు. జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు రాయడం వేరు. వాటిని మించి వ్యక్తిత్వ నిర్మాణాన్ని వెలికితీసి పరిచయం చేయడం వేరు. ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ. వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం నుండి విజయ గమ్యానికి.............