• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vyasa Gowtami

Vyasa Gowtami By Bethavolu Ramabrahmam

₹ 120

ఆంధ్ర వాఙ్మయ వ్యక్తిత్వము

'ఆంధ్ర సాహిత్యము అంతయు సంస్కృతము నోటినుండి ఊడిపడినదే' అను నంతటి తీవ్రవాదులు కలరు. భాషా విషయముగను సాహిత్య సంబంధముగను సంస్కృతము తెనుగుపై అధిక ప్రభావమును చూపినదనుట వారి యభిప్రాయము. నిజమే, ఆర్యభాషా కుటుంబమునకు చెందిన ఔత్తరాహ భాషలమాట సరేసరి. ద్రావిడభాషా కుటుంబమునకు చెందిన దాక్షిణాత్య భాషలలో గూడ ముక్కాలు మువ్వీసము సంస్కృత పదములున్నవి.

సంస్కృతభాష అతి ప్రాచీనమైనది. అందలి తొలి గ్రంథము ఋగ్వేదము. దీని కాలము క్రీ॥పూ. 1500 ప్రాంతమని మేక్సుముల్లరు అభిప్రాయపడెను. అది పౌరుషేయమా? అపౌరుషేయమా? అన్నది వేఱువిషయము. ప్రపంచమందే అది తొలిగ్రంథమనియు కొందరనిరి. కొన్ని దేశభాషలు అసలు రూపుదాల్పనప్పటినుండియు అభివృద్ధి చెందుచు వచ్చిన భాష కావున అందలి పదజాలమునకున్నంతటి విస్తృతి- ఆర్ధికశక్తి, మరి ఏ ఇతర భాషకును లేవు. ముఖ్యముగా ఆచ్చికాంధ్ర పదజాలము అత్యల్పము. ఊహను అందించుటకు సరిపడినన్ని పదములు ఇందులేవు. కొన్ని అచ్చతెనుగు పదములు అప్రసిద్ధములగుటచే అర్థసౌలభ్యమునకై కవులు ప్రసిద్ధ సంస్కృత పదములనే అధికముగా వాడుచు వచ్చిరి. దీనికి తిక్కనాదులు కొందరు అపవాదములు. మొన్న మొన్నటివరకు చదువుకొన్నవాడనగా సంస్కృతమును చదివిన వాడనియే కదా! అట్టియెడ సంస్కృత నిష్ణాతులైన కవులు తెలుగున కవిత వ్రాయునప్పుడు ఎంత కాదనుకొన్నను, సంస్కృతము ముద్రను తప్పించుకొనలేకపోయిరి. సంస్కృత కవులుకూడ వాడి యుండనంతటి ప్రౌఢ సంస్కృతమును ఆంధ్రకవులు వాడియుండిరని కొందరు పెద్దలందురు.

తత్సమ పదములతో అచ్చతెనుగు పదములను పోహళించినచో ఆ రచనలో గాంభీర్య సౌకుమార్యముల మేళనముతోడి యొకానొక సౌందర్య విశేషము స్ఫురించునను కళాదృష్టితో గూడ అట్టి మిశ్రరచనను సూరనాదులు కావించిరి. సంస్కృత పదచ్ఛాయయైన లేకుండ పనిబూని కొందరు అచ్చతెనుగు కబ్బములను వ్రాసిరి. యయాతి చరిత్ర, నీలాసుందరీ పరిణయము మున్నగునవి అట్టివి. కాని అవి లోకమున ప్రసిద్ధిని పొందలేదు. అనగా ప్రజాదరణమును చూరగొనునంతటి ఆకర్షణ వానియందు లోపించినదనుట సత్యము. వీనిలోనిది అచ్చతెనుగు అగునేమో కాని కవులకు అచ్చివచ్చిన తెనుగు మాత్రము కాదు.

ఏదియేమైనను ఆంధ్ర గీర్వాణములకు జన్యజనక భావ సంబందమును గూడ................

  • Title :Vyasa Gowtami
  • Author :Bethavolu Ramabrahmam
  • Publisher :Appajosyula Vishnubhotla Kandalam Foundation USA
  • ISBN :MANIMN5038
  • Binding :Papar back
  • Published Date :June, 2004
  • Number Of Pages :227
  • Language :Telugu
  • Availability :instock