పరిచయం
వర్తమాన సమాజంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అమలులో ఉంది. దీనికి ఈ విలక్షణత, ఈ చలనశీలత పెట్టుబడిదారీ, శ్రామిక వర్గాల మధ్య వైరుధ్యాల (antithesis) మూలంగా వస్తుంది. అయితే, వర్తమాన సమాజంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఒక్కటే లేదు, ఇప్పటికీ తమను తాము కాపాడుకుంటున్న పెట్టుబడిదారీ విధాన పూర్వపు ఉత్పత్తి విధానాలతో పాటు ఇది అమలులో ఉంటుంది. కొన్నిరకాల రాష్ట్ర పట్టణ ఆర్థిక వ్యవహారాలలో, సహకార రంగంలో కొత్త, ఉన్నతమైన ఉత్పత్తి విధానాల తాలూకు బీజాలు కనబడతాయి. అంతేకాకుండా, మన కాలంలో సామాజికశక్తుల ఘర్షణ ఒక్క పెట్టుబడిదారీ, శ్రామిక వర్గాల మధ్య మాత్రమే ఉండదు. ఈ రెండు వర్గాల మధ్య అనేకమైన వర్గాలు ఉనికిలో ఉంటాయి.
ఒకవైపున సమాజంలో ఉత్పత్తి అవుతున్న సంపదలోని అత్యంత కీలకమైన భాగాన్ని తీసుకుంటున్న వాళ్లూ, మరోవైపు అతి తక్కువ భాగంతో సరిపెట్టుకున్న వాళ్లూ ఉనికిలో ఉంటారు ఈ సమాజానికి ఒక ధృవంలో రాజాస్థానాల్లో తులతూగుతున్న ప్రభువులు ఉంటారు మరో వైపున అన్ని వృత్తుల నుంచి విసిరి వేయబడిన ఒక భ్రష్ట కార్మిక వర్గం ఉనికిలో ఉంటుంది. ఇలాంటి వర్గాలు కొన్ని సమూహాలని పెట్టుబడిదారీ పూర్వ సమాజం సృష్టిస్తే మరికొన్ని సమూహాలను పెట్టుబడిదారీ విధానం సృష్టిస్తూ వస్తోంది. కొన్ని సందర్భాల్లో తన అవసరాల కోసం ఆ వర్గాలతో పెట్టుబడిదారీ విధానం ఐక్యమవుతుంది. కొన్ని సమూహాలు పైకి ఎగబాగుతుండగా, మరికొన్ని సమూహాలు మరింత దిగజారిపోతున్నాయి. ఈ వర్గాలకు ఉన్న బహుళమైన, స్థిరంగా మారుతున్న అభిరుచుల మూలంగా కొన్ని సందర్భాల్లో పెట్టుబడిదారు వర్గంతో ఘర్షణ పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలను కౌగిలించుకుంటూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో కార్మికవర్గంతో ఐక్యతలో ఉంటారు. నిజానికి ఏ వర్గంతోనూ పూర్తిస్థాయిలో వీళ్ళ ఐక్యత కొనసాగదు. అందువలన వర్తమాన సమాజంలో కొనసాగుతున్న రాజకీయ ఘర్షణలూ, పోరాటాలూ ఒక ఆశ్చర్యకరమైన స్వభావాన్ని కలిగి ఉంటూ ఉంటాయి.
వర్ధమాన సామాజిక జీవితాన్ని నియంత్రించే ప్రాధమిక సూత్రాలను పరిశీలిస్తున్న సిద్ధాంతవేత్తలు, ఈ రీతులు నుంచి తమ దృష్టిని మళ్ళించకుండా, తికమక పడకుండా వుండాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు నిర్ధిష్టతలను శాస్త్రీయంగా పరిశీలించేటప్పుడు వ్యవసాయ సమస్య....................