• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Wittgenstein Smruthilo

Wittgenstein Smruthilo By Muktavaram Partha Saradhi

₹ 150

విట్గెన్ స్టీన్ స్మృతిలో

తనే 'చివరి' తాత్వికుణ్ణని ప్రకటించుకున్నాడు. విటిగెనె స్టీన్ సోక్రటీస్, ప్లేటో లాంటి గ్రీకు తత్వవేత్తలతో ప్రారంభమై, ఇరవైఅయిదు శతాబ్దాలుగా సాగిన పాశ్చాత్య తాత్విక ప్రస్థానం ముగిసింది. నేనే "Last Philosopher" నని చెప్పుకోవటం వెనక అదీ ఆయన అభిప్రాయం.

లుడ్విగ్ విటిగెన్ స్టీన్ తార్కిక ప్రతిభ అసామాన్యం. తాత్విక సమస్యల్ని చర్చిస్తున్నప్పుడు వచ్చే సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? సింపుల్. అన్ని సమస్యల్నీ తర్కబద్ధంగా విశ్లేషించాలి. తర్కానికి లొంగని మెటాఫిజిక్స్, ఈస్టటిక్స్, ఎథిక్స్, చివరికి ఫిలాసఫీ అయినా ప్రస్తుతం చర్చనీయాంశం కాదు. తాత్విక చర్చలను తార్కిక విశ్లేషణలుగా మార్చే ప్రయత్నం ఒకసారి కాదు రెండుసార్లు చేశాడు విటిగెన్ స్ట్రీమ్

చోట మొదట ఆయన కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం. 1889 ఏప్రిల్ 26 నాడు జన్మించాడు. విన్ స్టీన్ తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు. మొత్తం యూరోపులోనే అంతటి ధనవంతుడు లేదు. ఇక, ఇంట్లో ఆయన నియంతో కేమీ తీసిపోడు. అయినా, సాంస్కృతికపరంగా ఆయన అభిరుచి గొప్పది. Brahms లాంటి సంగీతకారులు. ఇంటికి వచ్చి మరీ కచేరీలిచ్చేవారు. అయితేనేం, కుటుంబసభ్యులకు మాత్రం ఆయనను చూస్తే హడల్. లుడ్విగ్ అన్నలు నలుగురు భయంతో బిక్కచచ్చి హోమో సెక్సువల్స్ గా మారారు. తరువాతి రోజుల్లో (వీళ్ళలోని) ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వియన్నాలో, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంటికి అల్లంతదూరంలో పెరిగాడు లుడ్విగ్, 1903లో లింజ్ నగరంలోని ఒక స్కూల్లో గణితం, సైన్సు చదువుకున్నాడు. కాకతాళీయంగా, ఆ కాలంలో హిట్లర్ కూడా అక్కడే విద్యార్థిగా వున్నాడు. ఇద్దరిదీ ఒకే వయసు. బహుశా క్లాస్మేట్స్ కూడా అయివుండవచ్చు......................

  • Title :Wittgenstein Smruthilo
  • Author :Muktavaram Partha Saradhi
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN4303
  • Binding :Papar back
  • Published Date :March, 2023
  • Number Of Pages :159
  • Language :Telugu
  • Availability :instock