• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yagna Vaisistyam

Yagna Vaisistyam By Sri Thotapalli Balakrishna Sharma

₹ 600

శ్రీరస్తు

  1. పుణ్యాహవాచనము-పూజ

"ఓం శ్రీ గురుభ్యో నమః గణాధిపాయనమః"

సర్వ శుభాశుభ కార్యములకు (కర్మలకు) పూర్వము విఘ్ననివృతికై విఘ్నేశ్వరుని పూజించడం అనునది "పద్మ పురాణం” చెప్పును. ఎందుకనగా విఘ్నేశ్వరుడును అగ్నిస్తుతికి స్వారూప్యమున్నది. అంతేగాక అగ్నిదేవుని రూపమే విఘ్నేశ్వరుని వాహనమగు మూషికము. అని “తైత్తరీయా బ్రాహ్మణం” చెప్పుచున్నది. అదియే ఇది

“అగ్నిర్దేవోభ్యోనిలాయత। తాఖుం రూపం కృత్వా స పృథివీం ప్రావిశత్| స ఊతీః కుర్వాణః పృథివీ మనుసమచరత్। తదాఖు కరీమభవత్"|

అగ్నికి నొకప్పుడు దేవతలపై కినుక కలిగి, వారికగపడకుండ దాగుటకై మూషిక రూపము ధరించి, భూమిలో బిలములనొనర్చుకొని, అందే సంచరించుచుండెను. బిలములనొనర్చేటప్పుడు బయటకు వెల్వడిన మట్టిలో అగ్ని యొక్క సాయుజ్యము ఇమిడి యున్నది. కావున ఇట్టి మట్టి యజ్ఞాంగమై, శుభ కర్మలందు యజ్ఞవేదికకు గాను ఈ మట్టిని వాడుటను నాచారమయినది.

పుణ్యాహవాచనము యొక్క విశిష్టత) ఆవశ్యకత

శిష్టులు పూర్వము నుండియు ప్రతికర్మకు ఆదియందు గణపతి పూజతో, పుణ్యాహవాచనము చేయు ఆచారము నేటికిని ఆచరణలో నున్నది. అందుకు ప్రమాణమిది.

"బ్రాహ్మణోవా అష్టావిగ్ంశో నక్షత్రణాం సమానస్యాహ్నః పంచ పుణ్యా నక్షత్రాణి......

యచ్చ పురస్తాత్ బ్రాహ్మణో ద్వాదశః (కృ:యజు: బ్రా: 1-5-3)

భా. కృత్తికతో ప్రారంభించి ఇరువదియేడు నక్షత్రములతో బ్రాహ్మణుడు ఇరువది ఎనిమిదవ నక్షత్రముగా, అతని వచనముతో "కాలము" కర్మకు యోగ్యమగుచున్నది. కావుననే శిష్టులు..........................

  • Title :Yagna Vaisistyam
  • Author :Sri Thotapalli Balakrishna Sharma
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4392
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :496
  • Language :Telugu
  • Availability :instock