ప్రవేశిక
విశ్వ సాహిత్యంలో అత్యంత అమూల్యమైన, అత్యంత ప్రాచీనమైన వేడ వాఙ్మయం విశ్వ మానవులందరి అపూర్వ సంపద, ఈ సంపద, భరతవర్షం ఋషులు తపోమగ్నులై వున్నపుడు అంతర్దర్శనంగా లభించినది. ఆ ఋషులు భరత ఖండమంతా వ్యాపించి వుండేవారు. తపస్సు ద్వారా తాము సంపాదించిన వేదాన్ని ఆ ఋషి పుంగవులు తమ పిల్లలకూ, శిష్యులకు బోధించారు. ఆ శిష్యులు వాటిని తమ శిష్య ప్రశిష్యులకు స్వర సహితంగా బోధించారు. ఇలా, ఈ విశిష్టమైన పరంపర ద్వారా ఈ వేద వాహిని భరతఖండమంతా వ్యాపించినది. ఈ వేద వాఙ్మయం పూర్తిగా కంఠస్థం చేయబడి వుండేది.
వేదవ్యాస మహర్షులవారు యిలా విస్తరించి చెల్లాచెదురై వున్న వేదరాసినంతటినీ సమీకరించి సంకలన పరచాలని భావించారు. వారు తమ శిష్యులతో ఈ పుణ్యభూమి అంతటా సంచరించి వేద సాహిత్యాన్నంతటినీ ఒక చోట సంగ్రహపరిచారు. అనంతరం వాటన్నింటినీ విభజించి క్రమబద్ధంగా జతపరిచారు. ఇలా సంగ్రహించ బడిన వేదాన్నంతటినీ ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలని వేరు వేరుగా విభజించారు. ఈ విధంగా వేదరాశిని విభజించినందున వారికి 'వేదవ్యాసు' అన్న నామం సార్ధకమైంది. వ్యాసుల వారికి చాల మంది శిష్యులుండేవారు. వారిలో పైల, వైశంపాయన, జైమిని, సుమంతు ఈ నలుగురూ వేదవ్యాసులవారి ప్రధాన శిష్యులు.
వేదం మానవ జీవితాల ధర్మదీపిక అయినది. మానవుడికి కావాల్సిన శ్రేయః, ప్రేయః పథాలను చూపగల అన్ని విద్యలూ అందులో యిమిడి వున్నవి. లౌకిక జీవితంలో సుఖం, సంతోషం, శాంతిని యివ్వగలిగే మార్గాన్ని వేదం చూపెడుతుంది. ఆత్మగురించి ఆలోచన ఆత్మజ్ఞానం మరియు ఆత్మానుభూతికి మార్గదర్శనం చేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ధర్మ, అర్ధ, కామ, మోక్షాలన్న పురుషార్థాలను వేదం బోధిస్తుంది. వేదం ముఖ్యంగా యజ్ఞం, యాగం మొదలైన కర్మ కాండలను గురించి ఉపదేశిస్తుంది. దేవతల అనుగ్రహం వల్ల ప్రపంచంలో సుఖ శాంతులు, ప్రశాంతత,...........................