అబద్ధపు బాణం
"అన్నా కావాలంటే ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగా ఇస్తాను. ఊర్లో దిగబెట్టన్నా" అన్నాడు సూర్యం ఆగిన ఆటో దిగకుండానే.
"ఎన్నిసార్లు తమ్ముడూ చెప్పేది.. టైం పదిన్నర అయ్యింది. ఈ టైంలో ఇక్కడిదాకా రావడమే ఎక్కువ. దిగి ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపో" ఆటో డ్రైవర్ చిరాగ్గా అన్నాడు.
ఇంకా అడుక్కుంటే బాగోదనిపించింది సూర్యానికి. దిగి, ఆటోవాడికి డబ్బులిచ్చేసి, ఊరి వైపు నడవడం మొదలుపెట్టాడు............