₹ 150
శిఖామణిగారి కవిత్వం అంటే ప్రేమ, కరుణ నిండిన జ్ఞాపకాలు ఊట! తాత్విక లోతుల ఆవిష్కరణ! ప్రశ్నించే ఒక ఇనుప పాళీ!
ఇదుగో ఇప్పుడు ఈ కవిత్వం - పుట్టిన దగ్గర్నుంచి క్షణం వదలక అనుక్షణం తనతో అవిభక్త కావలలా తిరిగిన సొంత వూరు యానాం గురించిన ఒక కలవరింత! ఒక పలవరింత! శిఖామణి గారు యానాంకి ప్రాణసఖుడు. చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే నిత్యా సావాసగాడు. తన దిగులుకళ్ళదుఖాన్ని ఓదార్చే ప్రియుడు! పుట్టి, తొలిసారి పసిపాదం మోపిన నెల! బాల్య యవ్వనాల మధ్య అనేక బంధాలతో అల్లుకున్న పరిసరాలు - ప్రదేశాలు - వస్తువులు - సంఘటనలు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నిలువరించలేని నోస్టాల్జిక్ జ్ఞాపకాలు వెంటరాగా, శిఖామణిగారు - యానాం గుండె లోతుల్లో గుంభనంగా తాపడం చేసుకున్న మానవీయ అనుభంధాలని తవ్వి తీసి, రాత్రి పొద్దుపోయాక గోదారి ఒడ్డున చుక్కల ఆకాశం కింద ఒంటరిగా కూర్చున్న యానాం భుజం చుట్టూ చెయ్యి వేసి ఆర్ద్రత నిండిన స్వరంతో తిరిగి కవిత్వంగా వినిపిస్తున్నారు.
- Title :Yanam Kavithalu
- Author :Sikhamani
- Publisher :Kavi Sandhya Publications
- ISBN :MANIMN0932
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :207
- Language :Telugu
- Availability :instock