గంగరేగిచెట్టు
ఎచ్చమ్మతల్లి పురుట్లనే కాలంజేసింది. ఆపిల్లపుట్టింది మూలనక్షత్రం. ఇగ ఆనక్షత్ర బలంకొద్ది కావల్సిన పని అయింది. 'ఈపిల్లపుట్టి నాగలక్ష్మిని దిగమింగే' నని తండ్రి కాశిరెడ్డి పిల్లను జూస్తె సీమలు, జెర్లు పాకినట్లు సీదరిచ్చుకుంటుండె. పాపం: ఆ పిల్లకు యాళ్ళ పాళ్ళ సూసెటోళ్ళు లేకపోతె ఆపిల్లను గొంచవోయి రుక్కుణమ్మ పెంచుకొన్నది. ఆపిల్ల పాలమూర్ల పెరిగింది.
కాశిరెడ్డి ఉక్కుకడ్డి అసొంటిమనిషి. నడుస్తెంటె బూమి నాదిచ్చేది. పల్కపెయ్యి, బారెడు ఎద, కోసుకండ్లు, సూడసక్కనిమనిషి, యశోదకు వొంకుల ఎంటికలు దప్ప అంతా తండ్రిపోవడే. తండ్రినోట్ల దుసి పడ్డట్లుంటది. బిడ్డదిక్కు మనసు రాయిజేసుకున్న కాశిరెడ్డికి ఎప్పుడో కలలభక్షాలుదిన్నట్లు బిడ్డ కండ్లల్లపడే రాయివారిన మనసు ఎన్నముద్దోలె అయ్యేది. అడప దడప పేషీల కని మొకద్దముల కని పాలమూరికొచ్చినప్పుడల్లా బిడ్డను జూసి పోయెటోడు. అప్పుడు తనను బిల్సుక పోనికే వొచ్చిన జతగాండ్లను జూసి “అబ్బ! మానాయి నొచ్చిండు. ఈ గాజప్పలాట ఆడను పొద్దుమూకి గూడ ఎన్నెలకుప్పలాటకు ఉద్దిని ఎవర్నన్న ఏరుకోండి" అని ఇంటి కెవరో కావాల్సిన సుట్టపాయన వొచ్చినట్లు చెప్పేది.
ఎప్పటితీర్గనె ఈ త్యాప గూడ కాశన్న పాలమూరి కొచ్చిండు. ఎచ్చమ్మ కిప్పుడు తొమ్మిదేండ్లు. ఎప్పటితీర్గ గాకుండ, ఈ సారి తండ్రొచ్చి స్తానం జేసిరాంగనే అద్దం బొట్టుపుల్ల, కుంకుమ తెచ్చి ఇచ్చింది. తండ్రి అద్దంలో నామం దిద్దుకుంటుంటే ఎన్కనుండి వొచ్చి, “నాయనా:” అని బుజాలు పట్టుకొని యాళ్ళాడింది. తన మొకం పక్కకు బిడ్డ మొకం అచ్చం చిన్నకాశన్నోలె అద్దంల గానొచ్చింది. అదిజూసి తండ్రికడ్పుల సేయిపెట్టితిప్పినట్లైంది. అమాతం చేతులుమల్సి బుజాల మీదికి బిడ్డను గుంజుకోని, తొడల మీదేసుకోని "ఎచ్చలూ: నా
ఎచ్చమ్మతల్లి సరస్వతమ్మ తద్దినం పుష్యమాసంలోనే వస్తది, సంక్రాంత్రిపండుగ ఆనాటికి రొండు దినాలు అటో ఇటో ఉంటది. ఇగ సంకురాత్రినెల నిలవెట్టంగనే చెల్లెలు ముత్యాలమ్మ, మ్యానల్లుడు రఘునాథరెడ్డి ఊళ్ళో ఉన్న అల్లుడు ఎంకట్రెడ్డి అంతా ఆయింట్లో జేరుకునే టోళ్ళు. ఈ దినాలల్లనే పిల్లను ఎంటపెట్టుకొని పాలమూరినుండి రుక్కుణమ్మగూడ బిజినపల్లెకు వొస్తుండె. బిజనపల్లెకు వొచ్చినప్పుడల్ల ముత్యాలమ్మ అన్నను జూని “అన్నా, తల్లిగారింటి సమందం తెగదెంపులు జేయకు. మా యత్తగారింట్ల నామాట నెగెటందుకు...............