ఏడడుగులు
"ఏమిటి ఆర్యా! కంగారుగా ఉన్నావు? ఎప్పుడూ నీట్గా ఉండే నీ గది ఇంత చిందరవందరగా ఉంది. లాప్టాప్ ఎందుకు తెరిచి పెట్టావు? పుస్తకాలన్నీ ఉండాల్సిన చోట లేవు. ఏంటిరా చెప్పు? ఏంటి అదోలా ఉన్నావు? నిన్నటిదాకా చాలా ఆనందంగా ఉన్నావు, ప్రపంచాన్ని జయించినంత గర్వంగా కనపడ్డావు, ఇప్పుడేంటి ఇలా? ఏదైనా గుర్తుకొచ్చిందా? అయినా నీకేం గుర్తుంటాయి చదువు, పుస్తకాలు, లాప్టాప్, రోగుల గురించి తప్ప! చెప్పు, నాకు విసుగు పుట్టించకు!” - కాస్త విసుగ్గానే అడిగాడు రాజేష్.
"అబ్బే! ఏమీలేదు! ఇన్నిరోజులుగా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసానా! ఒక ప్రపంచ వేదిక మీద మాట్లాడాలని పిలుపు వచ్చింది. ప్రిపేర్ అయ్యాను. అది ఒక పెన్న్డ్రైవ్లో స్టోర్ చేసాను. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టానో గుర్తురావడం లేదు. తక్కువ రోజులు ఉన్నాయి” - ఆర్యన్ గొంతులో ఏదో కంగారు.