• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yoga Bala Shiksha

Yoga Bala Shiksha By KVSK Murty

₹ 700

యోగ బాలశిక్ష

గీతా సారాంశము

అయ్యిందేదో మంచికే అయింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. -అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.

నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?

నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడనుండే పొందావు. -ఏదైతే ఇచ్చావో ఇక్కడ నుంచే ఇచ్చావు. -ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,నిన్న ఇంకొకరి సొంతం దాచిపెట్టిన ధనం భూమి పాలు - అందమైన ఈ దేహం అగ్నిపాలు - అస్తికలన్నీ గంగపాలు ఈ జీవం యముని పాలు - కొడుకు వండిన కూడు కాకిపాలు మన వస్తువులన్నీ ఎవరి పాలో తాను చేసిన దానం, ధర్మం, పుణ్యం మాత్రం తన పాలు |

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అందరినీ మరిచినా నీ తల్లిదండ్రులను మరువ వద్దు. వాళ్ళను మించి మంచి కోరే వారూ ఉండరని తెలుసుకో... నువ్వు పుట్టాలని ఎన్నో పూజలు, త్యాగాలు చేశారు వారు, రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు, నీకు అమృతమిచ్చిన వారి పైన నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు, ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? సేవాభావం లేకపోతే అంతా వ్యర్థమే, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువ వద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు.

అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు. .నీవు నడిచే దారిన పూలు వేసారు వారు, ముల్లువై వారిని బాధించకు.

డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు, తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది, తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు, వారి గొప్పతనం జీవితాంతం మరువవద్దు. తల్లిదండ్రులను, శాస్త్రములను, గురువులను, పెద్దలను, స్నేహితులను గౌరవించేవాడు అందరికి ఆదర్శవంతుడు కాగలడు.

ఆత్మలింగానికి అభిషేకం

గానికి ప్రతిరోజూ అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని ఈశ్వరుడు మనకు ఇచ్చాడు...మనం స్నానం చేసే సమయంలో

వి ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి. అలా చేస్తే ఆత్మలింగానికి అభిషేకం

సేటప్పుడు ఓం నమః శివాయ ' అని అనండి అంతే, మనం ఆత్మ లింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది. ఇలా ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు అభిషేకం చేయండి. .మీ మనసు పవిత్రం అవుతుంది.

నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వ పడేటట్లు జీవించు, అంతే కానీ నిన్ను చూసి బాధపడేటు కాదు. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే! శత్రువు కూడా కన్నీరు పెట్టాలి - అదీ బ్రతుకంటే...............

  • Title :Yoga Bala Shiksha
  • Author :KVSK Murty
  • Publisher :KVSK Murty
  • ISBN :MANIMN3593
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :443
  • Language :Telugu
  • Availability :instock