• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yudham Madhyalo Nuvvu

Yudham Madhyalo Nuvvu By Afsar

₹ 200

యుద్ధం మధ్య నిలబడ్డాడు అఫ్సర్

రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి 2000ల తెలంగాణ, దేశ సామాజికార్థిక సాంస్కృతిక నేపథ్యాన్ని, క్రమంగా విస్తరిస్తూ పర్వతం పైకి అధిరోహించిన కొద్దీ ప్రపంచం విశాలంగా కనిపించే దార్శనికత దృష్ట్యా అఫ్సర్ కవిత్వాన్ని అంచనా వెయ్యాలి. 80ల కవిత్వాన్ని వివేచించే సాహిత్య ప్రమాణాలు ఏర్పడలేదన్నాడు. ఆనాడు. అక్కడి నుంచి కవిత్వంలోనే కాదు, సాహిత్య విమర్శ, సామాజిక విశ్లేషణ, తెలంగాణలో వచ్చిన పురోగమన, తిరోగమన మార్పులను అర్థం చేసుకోవడానికి చేసిన క్షేత్రస్థాయి అధ్యయనాలు, పరిశోధనలు, తెలంగాణ విమోచనోద్యమ కాలపు మతసామరస్యం, గడ్డివేళ్ల స్థాయి భూసంస్కరణలతో కూడిన ప్రజారాజ్య బీజరూపం, రాజ్యం జోక్యం, రజాకార్ల ఫేజ్, ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ఆపరేషన్ పోలో, హిందుత్వ ఆక్రమణ, దాడి - ఇవన్నీ జీర్ణించుకున్న కవిత్వం. దర్గాల క్షేత్రస్థాయి అధ్యయనం, సూఫీ కవితలు, రోజా (ఉపవాస) కవితల్లో ప్రతిఫలించే ఉన్నత మానవీయ విలువలైన సమానత్వం, ప్రేమ, స్నేహాలనే కవి ప్రపంచానికీ మనిషికి నిలవ నీడలేని, విస్థాపన, ఆక్రమణ సామ్రాజ్య వాద కార్పొరేట్ల విస్తరణ యుద్ధానికి మధ్య సంఘర్షణలో అఫ్సర్ ఇప్పుడు ఈ యుద్ధం మధ్య నిలబడ్డాడు - పాలస్తీనా న్యాయం కోసం, ఆదివాసీ న్యాయం కోసం - అఫ్సర్ అయిన అభివ్యక్తితో....................

  • Title :Yudham Madhyalo Nuvvu
  • Author :Afsar
  • Publisher :AJU PUBLICATIONS
  • ISBN :MANIMN5950
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :184
  • Language :Telugu
  • Availability :instock