• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yuga Nayika

Yuga Nayika By Abhay Morya

₹ 150

యుగనాయిక

వివేక్ ఢిల్లీ వచ్చి కొన్ని నెలలే అయ్యింది. ఇంకా ఢిల్లీ అతనికి కొత్తగానే వుంది. తన గ్రామంలో హయ్యర్ సెకండరీ పరీక్ష పూర్తి చేసుకుని, కాలేజీలో చేరడానికి ఢిల్లీ వచ్చాడు. కాలేజీలో చేరి కొన్ని నెలలయినా అతనికి కాలేజీ వాతావరణం ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. విద్యార్థుల్లో కొంత మంది పెద్దపెద్ద నగరాలకు చెందిన ధనవంతుల పిల్లలు. వాళ్ళతో వివేక్కి పొంతన కుదిరేది కాదు. కొన్నాళ్ళపాటు తనకు తాను అందరికంటే వేరుగానూ, ఒంటరిగానూ, భావించుకునేవాడు. ఇటువంటి వాతావరణంలో అతనికి చాలా ఆనందాన్నిచ్చే దృశ్యం ఒకటుంది. అది అందమయిన కాలేజి ఈతకొలను పక్కన కూర్చొని ఎత్తయిన స్ప్రింగ్ బోర్డు మీది నుంచి నీళ్ళలోకి దూకే విద్యార్థుల్ని చూడటం... అలా చూస్తుంటే తన బాల్యం గుర్తుకు వస్తుంది అతనికి. ఊరి చెరువులో తను ఈత నేర్చుకునేవాడు. వానాకాలంలో చెరువు వర్షపునీటితో పొంగి పొర్లుతూ వుండేది. ఊరిపిల్లలు చెరువు గట్టు మీద తుమ్మచెట్టు ఎక్కి చెరువులోకి దూకుతూ వుండేవాళ్ళు. ఇట్లా చెరువులోకి దూకడమంటే వివేక్కి ఎంతో ఇష్టం.

కాని ఇక్కడ కనిపించే దృశ్యమే వేరు. కొత్త కొత్తగా ఈత కొట్టడం నేర్చుకునే విద్యార్థుల భయం చూస్తుంటే అతనికి జాలి వేస్తుంది. వాళ్ళు కళ్ళకి తడి తగలకుండా అద్దాలు పెట్టుకొని, కాళ్ళకి చేప తోకల్లాంటి రబ్బరు బూట్లు వేసుకొని, ఉదర బలంతో కాళ్ళు చేతులూ తప తప కొట్టుకుంటూ ఈదే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడప్పుడు బుడుంగుమని మునిగిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఈతనేర్పే కోచ్ వారి పొట్ట కింద చేయి పెట్టి పైకి తీసుకువస్తాడు. వాళ్ళు మళ్ళీ

కాళ్ళూ, , చేతులూ తపతపా కొట్టుకోవడం మొదలు పెడతారు. తల్లి బిడ్డ రెండు చేతుల్నీ పట్టుకుని నడక నేర్పినట్టుగా ఉంటుంది. పిల్లవాడు ఒకసారి కుడివైపుకి, మరోసారి ఎడమవైపుకి తూలుతూ ఉంటాడు. ఒకసారి ముందుకు పడుతూ, మరోసారి వెనక్కి జారుతూ ఉంటాడు. కాని తల్లి మాత్రం పిల్లవాణ్ణి పడిపోనివ్వదు. మెల్లమెల్లగా నడిపిస్తూ ఉంటుంది. పిల్లవాడు తడబడుతూనే చిన్న చిన్న అడుగులు వేస్తూ, నడుస్తూ ఉంటాడు. ఈ ఈత నేర్చుకునే పిల్లల స్థితీ అంతే.

కాని స్ప్రింగ్ బోర్డు మీది నుంచి దూకే విద్యార్థులు తమని తాము తీస్మార్ ఖాన్ల మనుకుంటారు. వాళ్ళ గర్వం చూసి వివేక్ లోపల్లోపల నవ్వుకుంటాడు. వాళ్ళు ఛాతీ విరుచుకుని స్ప్రింగ్ బోర్డు మీదకి ఎక్కుతారు. దాని మీద నిలబడి గర్వంగా చుట్టుపక్కల కూర్చున్న వారివైపు దృష్టిసారిస్తారు. గద్ద రెక్కలు చాపినట్టు, తమ రెండు చేతులూ చాపి కిందికి దూకే బదులు ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా ఒక దూకు దూకుతారు. చివరికి కిందకు దూకి, నీటిలోకి........................

  • Title :Yuga Nayika
  • Author :Abhay Morya
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN4421
  • Binding :Papar back
  • Published Date :Nov, 2008
  • Number Of Pages :376
  • Language :Telugu
  • Availability :instock