₹ 270
ఆధునిక తెలుగు జాతి తొలి వెలుగుబావుటా, చైతన్య కాగడా కందుకూరి వీరేశలింగం శత వర్ధనతి సందర్భంలో అందిస్తున్న అరుదైన ప్రచురణ ఇది. తమ కాలంలో ప్రజలను చైతన్య పరిచి నాయకత్వం వహించి నడిపిన వారు నాయకులు. సమాజాలలో తమకు ముందునుంచి కొనసాగుతున్న పద్ధతుల మంచి చెడ్డలను తర్కించి హానికరమైన వాటికీ పరిహరించే ఉద్యమాలు నడిపించి ఉతేజం నింపి భవిష్యత్ పయనాన్ని వేగిపర్చిన వారు వైతాళికులు. మొదటి వారి ప్రభావం సమకాలీనంగా ఉంటే రెండవ తరహా వారి ప్రభావం తరతరాలు కొనసాగుతుంటుంది. తదుపరి తరాలలోను చాల మంది అందుకోలేనంత ప్రగాఢంగానూ వుంటుంది. ధార్మికత, రాజకీయం ఉద్యమాలు, కల సాహిత్యాలు ఇలా చాల రంగాల్లో మానవ ప్రస్థానం సాగుతుంటుంది గని అందులో అత్యంత బలీయంగా అల్లుకుని వుండేవి ఆచారాలు సంప్రదాయాలు. తత్కాలపు పరిస్థితులను పరిణితిని బట్టి రూపు దిద్దుకునే ఈ ఆచారాలు ఉత్తరోత్తరా ఘనీభవించి సదుపాయాలుగా వున్నవి సంకేతాలుగా మారిపోవడం కద్దు.
-తెలకపల్లి రవి.
- Title :Yugapurushudu Viresalingam
- Author :Thelakapalli Ravi
- Publisher :Prajashakti Publications
- ISBN :MANIMN0552
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :336
- Language :Telugu
- Availability :instock