• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yuva Nyayavaadula Vijayaniki Margadarshakulu

Yuva Nyayavaadula Vijayaniki Margadarshakulu By B Chandra Kumar

₹ 200

చట్టం వల్ల ఉపయోగాలు

శాంతియుత సమాజ పురోభివృద్ధికి చట్టం తోడ్పడుతుంది. వ్యక్తులు ఆరోగ్యంగా, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించడానికి చట్టం ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తికి పుట్టుకతో కొన్ని హక్కులు, బాధ్యతలు (Right Liabilities) సంక్రమిస్తాయి. చట్టాన్ని ఉపయోగించి ఆ హక్కులు కాపాడుకోవచ్చు.

మన చుట్టు ఉన్న సమాజంలో ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. వారికి ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ వారు తమ హక్కులని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆస్తిలో హక్కు ఉండి ఆస్తులను అనుభవించలేని వారున్నారు. నేరాలకు గురైనటువంటి వారు ఆ నేరం చేసినవారిని జైలుకి పంపించడంతో పాటు వారినుండి నష్టపరిహారం పొందే హక్కు కలిగి ఉన్నారు. అందుచేత యువ న్యాయవాదులు చట్టాలను బాగా తెలిసికొని, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వారి కష్టసుఖాలను తెలుసుకొని చట్టప్రకారం వారికి ఎలాంటి రక్షణ కల్పించవచ్చో, లేదా నష్టపరిహారం ఇప్పించవచ్చో లేదా వారి హక్కులను ఏ విధంగా పరిరక్షించవచ్చో పరిశీలించి ఆ విధంగా వారికి న్యాయం దొరికేటట్లు చూడాలి.

చట్టాలు అనేక రకాలుగా ఉన్నాయి. Civil, Criminal, Human Rights, Family Laws etc. ఒకే న్యాయవాది అన్ని రంగాలలో విజయవంతంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. తన అభిరుచిని, అవకాశాలను బట్టి తనకు - నచ్చిన, ఇష్టమైన రంగంలో ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాల్సి - వుంటుంది. ఒక న్యాయవాదిగా ఉండి కేవలం క్లర్క్ గా పని చేయటం ఎంతమాత్రం సరియైనదికాదు. అలాకాకుండా కష్టపడి కొంత అనుభవాన్ని సంపాదించి స్వతంత్రంగా స్వంతంగా వృత్తిని చేపట్టాలి.

కష్టాల్లో ఉన్నవారి పట్ల కనికరం చూపుతూ పనిచేస్తే, అలా పనిచేసిన వారికి తప్పకుండా కనికరం లభిస్తుంది.

యువన్యాయవాదులు విజయవంతమైన న్యాయవాదులు కావడానికి ధృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి. న్యాయవాది తన వృత్తిలో విజయం సాధించాలంటే మొదట కావాల్సింది శ్రద్ధ విషయాలను శ్రద్ధగా తెలుసుకోవడం, ప్రతీ డాక్యుమెంట్ను..............

  • Title :Yuva Nyayavaadula Vijayaniki Margadarshakulu
  • Author :B Chandra Kumar
  • Publisher :JCK LAW ASSOCIATES
  • ISBN :MANIMN5269
  • Binding :Papar back
  • Published Date :Sep, 2020 first print
  • Number Of Pages :117
  • Language :Telugu
  • Availability :instock