• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yuvanika

Yuvanika By K V V Satya Narayana

₹ 200

ఒకటవ అంకం
 

కాకినాడ - సూర్యకళా మందిర్ - సాయంత్రం

"మనిషి కష్టాన్ని గుర్తించి దానికి పరిష్కారాన్ని సూచించే మైత్రీబంధాన్ని 'నాటకం రసాత్మకం కావ్యం,' అనో, 'కావ్యేషు నాటకం రమ్యం,' అనో ఏడాదికో నమస్కారం చేసి, చుట్టచుట్టి అటకెక్కించి చేతులు దులిపేసుకోవడం సబబు కాదు. మన హితాన్ని కోరేదాన్ని సన్నిహితంగా ఉంచుకోవడం దోషమూ కాదు. మన అవసరాన్ని నాటకం గుర్తిస్తోంది, నాటకాన్ని మన అవసరంగా గుర్తించడం వ్యసనమూ కాదు.

'నాటకం జీవితంలో ఒక భాగం,' అన్నాడు జర్మన్ బెర్టోల్ట్ బ్రెస్ట్. 'సజీవ సామాజిక చిత్రం,' అన్నాడు రష్యన్ స్టాన్స్ లాయిస్కీ, అసలు 'జీవితమే రంగస్థలం' అన్నాడు బ్రిటిష్ షేక్స్పియర్. సాహిత్యానికే చివరిమెట్టుని చేసి 'నాటకాంతం హి సాహిత్యం,' అనేసాడు మన కాళిదాసు.

నాలుగు చప్పట్లు తప్ప ఏం అడుగుతుందండీ నటన? గంగాజలం లాంటిది. నటనైతే గంగోత్రి నాటకం. గంగాప్రవాహం ఎన్ని మలుపులైనా తిరగొచ్చు కానీ గంగోత్రే దాని జన్మస్థలం. నటన ఈరోజు ఎన్ని నడకలైనా నేర్చుకోవచ్చు కానీ దాని తొలి అడుగుల అమ్మ ఒడి నాటకమే!

ఇక అధ్యక్షులవారు అన్నట్లు 'సంహిత'నా డ్రీమ్ ప్రాజెక్ట్, మానవ వినాశనానికి కారణమయ్యే పరిణామానికి కారకాలను గుర్తించి ఊరికో, దేశానికో పరిమితం కాకుండా విశ్వమానవాళికి హెచ్చరికలాంటి ఒక తెలుగునాటకాన్ని ఇవ్వాలన్నది నా కల. నా జీవనసాఫల్య సాకారతగా నాటక మాధ్యమంలో మనవాడి వాడినీ, వేడినీ దిగ్దం చేయాలనేది ఈ జీవితేచ్ఛ. కానీ ప్రస్తుత పరిస్థితులలో అందమైన నాకల అందనంతగా మిగిలిపోతోంది. సరి. ప్రస్తుత విషయానికి వస్తాను. ఈరోజు మార్చి ఇరవై ఏడు. ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన 'జాతీయ నాటక సమాఖ్య' తెలుగు రంగస్థలాన్ని ఎంచుకొని, దానికి నన్ను సన్మానించి, సత్కరించింది. హృదయ పూర్వక కృతజ్ఞతలు... ఇప్పుడు నాదో చిన్న విన్నపం..................

  • Title :Yuvanika
  • Author :K V V Satya Narayana
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5850
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :173
  • Language :Telugu
  • Availability :instock