అసాధారణ మేధస్సు, విభిన్న వ్యక్తిత్వం గల అరుదైన వ్యక్తి తారసపడితే,
3 ముందుగా అతను చదివే పుస్తకాలు గురించి వాకబు చేయండి.
- రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
రామనాథన్ శ్రీరామ్
క్రాస్వర్డ్ బుక్ స్టోర్స్, ప్రథమ్ బుక్స్
"ఒరే నువ్వు ఇంజనీర్ కావాలన్నది నా కల.. ఆ సాహిత్య పుస్తకాలు పక్కన పడేసి... పాఠ్య పుస్తకాలు చదువు.." అంటూ పదే పదే మందలించేవాడు శ్రీరామ్ తండ్రి. 'ఇంజనీరింగ్ చేయకపోతే జీవితం వ్యర్థమైనట్లేనా? ఏంటి నాన్నా? పదేపదే చెబుతుంటావు. నా ఇష్టానికి వదిలేయి' అంటూ ఎదురు ప్రశ్నించేవాడు శ్రీరామ్. తన జీవితాన్ని తనే రూపుదిద్దుకోవాలన్నది అతని ఆలోచన. చిన్నప్పటి నుంచి బ్రిటిష్ లైబ్రరీలో చదివిన పుస్తకాలు, ఆ సాహిత్య అభిరుచే 'క్రాస్వర్డ్' బుక్ర్ నెలకొల్పేందుకు ప్రేరణ ఇచ్చింది. తను చదవడమే కాదు... ఇతరులతో చదివించడమూ శ్రీరామ్ చేసిన గొప్ప వ్యాపారం...' అక్షరం వీరికి వ్యాపారం మాత్రమే కాదు... ఆత్మసంతృప్తి..........