స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో....................