• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Andhra Pradesh Bhoomi Hakkula Yajamanya Chattamu 2022

Andhra Pradesh Bhoomi Hakkula Yajamanya Chattamu 2022 By Suprem Law House

₹ 90

ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టము, 2022

ఈ క్రింద ఉదహరింపబడిన చట్టము ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా పొందుపరచబడింది. దీనిపై గుర్తింపు, పరిగణన కోసం 22 అక్టోబర్ 2022 నాడు గవర్నర్ వద్ద మరియు రాష్ట్రపతి అంగీకారం కోసం వేచివుంది. 29, సెప్టెంబర్ 2023 నాడు రాష్ట్రపతి అనుమతి పొంది 17 అక్టోబర్, 2023 నాడు ముందుగా ఆంధ్రప్రదేశ్ గెజిట్ నందు ప్రచురింపబడింది.

'(2023 యొక్క చట్టము సంఖ్య 27)

స్థిరాస్తుల హక్కుల రిజిష్టీకరణ పద్ధతిలో స్థాపన, పరిపాలన మరియు నిర్వహణ కొరకు మరియు వాటికి సంబంధించిన మరియు అనుషంగికమైన విషయములను నిబంధించుటకైన చట్టము.

భారత ప్రజారాజ్యపు డెబ్బై మూడవ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండిలిచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినవి :-

ఉద్దేశ్యములు మరియు కారణములు

ప్రస్తుత దస్తావేజుల రిజిస్రీకరణలో స్థిరాస్తికి సంబంధించిన దస్తావేజులు ఏ విధమైన సరి నిరూపణ లేకుండానే రిజిష్టీకరణ చట్టము. 1908 క్రింద జరుగుతున్నాయి. భారతదేశము సత్వరంగా సాంకేతిక యుగంలోనికి ప్రవేశిస్తున్నందున హక్కుల రిజిస్రీకరణ పద్ధతిని ప్రారంభించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా న్యాయస్థానాలలో తక్కువ వ్యాజ్యాలతో భూ మార్కెటు పెరగడానికి ఎంతో ఆస్కారముంటుంది. అందుచేత భూమిని గరిష్ఠంగా ఉపయోగించుకొనేందుకు వీలవుతుంది.

భూపరిపాలన పద్ధతిని మెరుగుపరచేందుకు మరియు ఆస్తి హక్కుదారులకు వాటి భద్రతకు వీలును కలిగించేందుకు భూ సమాచార వ్యవస్థ మరియు దీనిని....................

  • Title :Andhra Pradesh Bhoomi Hakkula Yajamanya Chattamu 2022
  • Author :Suprem Law House
  • Publisher :Suprem Law House
  • ISBN :MANIMN5046
  • Binding :Papar back
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :56
  • Language :Telugu
  • Availability :instock