Logili Books

Novels

Bammagaru

By Vinay Katam

₹220
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bammagaru
Author
Publisher
Vidmahi Publications
ISBN
MANIMN6755
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
148
Language
Telugu
Availability
In Stock
About this book

బామ్మ గారు

సూర్యుడు ఉదయించాడు నగరం మెల్లిగా మేలుకుంటుంది. నేను మాత్రం అప్పుడు అప్పుడే నిద్రపోయాను. ముందు రోజు తాలూకు చేదు అనుభవాలు కావొచ్చు నిద్రపోనీయకుండా నన్ను తెల్లవారుజాము వరకు ఇబ్బంది పెట్టాయి. ఎంత మరిచిపోయి పడుకుందామన్నా వినవే.

అదేంటో కానీ.. రోజంతా పని చేసి, ఇంటికొచ్చి కాస్త సేద తీరి భోంచేసి ఒళ్ళు వాలుద్దామనుకునే సమయానికి అడ్డుపడడం మొదలు పెడతాయి. అలాచేస్తే ఒరిగేది ఏమి లేదని ఇరువురికీ తెలిసినా, ఆలోచనలు నన్ను అంత సులువుగా విడిచి పెట్టవు. మొత్తానికి నిద్రలోకి జారుకున్నా. ఇలా పడుకున్నానో లేదో ఓ కేక వినబడింది.

మా అమ్మ "ఒరేయ్ ఈరోజు శుక్రవారం బండలు కడగాలి. లేవరా” అంటూ లోపలికి వస్తూ ఉంది.

అరే నిన్న అయితే ఇంటర్ పరీక్షలు అయిపోయాయి, సెలవులే కదా పడుకోనిలే.. అనే ఆలోచనే ఉండదు పైగా శుక్రవారం ఏం అనలేము. అమ్మ చీపురుతో నా గదిలోకి వచ్చేలోపే మడతపెట్టిన చాప ఒక చేతిలో దుప్పటి దిండు ఇంకో చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాను. “త్వరగానే లేచావ్ రా” అని లోపలికి వచ్చింది.

“అసలు పడుకుంటే గా” అని విసుక్కుంటూ నేను గది బయటికి వెళ్లాను. అలా వెళ్లి కుర్చీలో కూర్చున్నానో లేదో పడుకుండి పోయాను. కళ్ళు తెరిచే సరికి కళ్ళ ముందు గరిట పట్టుకొని అమ్మ నిలపడింది.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?