Logili Books

Telugu

Basha Sahityam

By Ainavolu Ushadevi

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Basha Sahityam
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN7028
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
344
Language
Telugu
Availability
In Stock
About this book

భాషా వివేచన

ప్రపంచ సృష్టిలో మనిషి భిన్నమని చెప్పడానికి అనేక విధాలైన కారణాలు చూపించవచ్చు. విశ్వాన్ని గురించి, సృష్టి గురించి, ఇతర ప్రాణులు గురించి, తనను గురించీ కూడా మానవుడొక్కడే ఆలోచించగలడు, మాట్లాడగలడు, మార్పులు, చేర్పులూ చేయగలడు. వీటన్నిటికీ మూలధారం ప్రధానంగా భాషే అని చెప్పవచ్చు. అయితే ఈ మానవభాష పుట్టుక ఎలా జరిగింది అని చెప్పడానికి నిర్ధారించే, నిర్ణయించే శాస్త్రీయ సూత్రాలు మాత్రం ఇంకా అంతుచిక్కలేదు. అయితే ప్రపంచంలో చాలా భాషల్లో వేల సంవత్సరాల నుండీ ఈ అన్వేషణ జరుగుతూనే ఉంది. ప్రకృతిలోని ధ్వనులను అనుకరించడం ద్వారా (డింగ్ డాంగ్ వాదం. పూ-పూ వాదం మొ.) భాష ఉత్పన్నమయిందనే వాదం ఒకటి కొంతకాలం ప్రాచుర్యంలో ఉండేది. అయితే దానికి పూర్వమే ఇది దైవిక సృష్టి అన్న వాదం ఉంది. భారతీయ మతంలో ఈశ్వరుడినీ, సరస్వతినీ, వినాయకుడినీ, ఇంద్రుడినీ భాషావిర్భావం, భాషావగాహనా, విద్యా విషయక అంశాలకు కారకులుగా పేర్కొనడం జరిగితే, బైబిలులో దేవుడే మొదట పదాన్ని సృష్టించాడని చెప్పడం జరిగింది. ఈ విధమైన ఊహలు చాలా భాషల్లో కనిపిస్తాయి. హేతువాదులు, తార్కికులూ మాత్రం, (ముఖ్యంగా ఏంగెల్స్, మార్క్స్) మానవుడి శ్రమ నుండే భాష ఉత్పన్నమయిందనీ, మనిషి తన ముందు కాళ్లు రెంటినీ చేతులుగానూ, పరికరాల (ఆయుధాలతో సహ) సృష్టికి ఉపయోగించుకొనేందుకు వీలుగా మార్చుకుంటున్న నేపథ్యంలోనే భాషకూడా ఆవిర్భవించి ఉండవచ్చునన్నారు..

భూమ్మీద ఇతర ప్రాణికోటికి కూడా ఏదో ఒకరకమైన భావవినిమయ వ్యవస్థ అంతో ఇంతో ఉందన్నది వాస్తవం. తేనె సంపాదనకోసం పరిశ్రమించే భ్రమరజాతులు కొన్ని రకాల వృక్షాల ద్వారా తేనె ఉన్న చోటు, అటు వెళ్లే విధానం, మొ॥ సూచిస్తాయని పరిశోధనలు తెలియజేస్తాయి. అలాగే, వివిధ రకాలకు చెందిన, మానవులకు సన్నిహితమైన కోతిజాతులు చింపాంజీలు, గిబ్బనులు మొదలైనవి కూడా వివిధ రకాల ధ్వనులద్వారా ఆహార ప్రమాద మైథునాదులకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేసుకుంటాయని ఎన్నో................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?