Logili Books

Short Stories

Bhamidipaati Kameshwar Rao Rachanalu- Hasyavallari, Kalaskepam, Gusagusa Pelli

By Bhamidipaati Kameshwar Rao

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bhamidipaati Kameshwar Rao Rachanalu- Hasyavallari, Kalaskepam, Gusagusa Pelli
Publisher
Nava Chetan Publishing House
ISBN
MANIMN6860
Binding
Paerback
Published Date
Nov, 2024
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

కాలక్షేపం

(TIT BITS) మొదటి భాగం •

ణాటికెట్టు పెట్టి, సోమయ్య, ఒకచోట గ్రామఫోను వాయిస్తూఉన్న సమయంలో సూది అదే గాడిలో పాడడంవల్ల గుర్రుమని అదేధ్వని కాగా, శ్రోతలలో ఒకడైన...

కైలాసం - ఆ పాడేవాణ్ణి లేచికూర్చుని తిన్నగా పాడమనకూడదూ?

అనగా, నలుగురూ నవ్వగా,

కై - (పక్కవాడి చెవిలో నాది పొరపాటుగావును! గ్రామఫోను పుంలింగమా, స్త్రీలింగమా?

పక్క - నపుంసక కూడాను!

కై - అయితే త్రిలింగా?

పక్క కాదు. గ్రామఫోనూ, కాళహస్తీకూడా వాయులింగాలే!

మేష్టరు - ఈ లెక్కకి ఆన్సరు అర్ధణా తక్కువ వచ్చిందేం? సోలయ్య !

సో - నిన్న పొద్దున్న మా బామ్మచేతి కిచ్చానండి.

మే - అడిగి పట్రా రేపు.

సో - (విచారంతో) నిన్న సాయంత్రం మా బామ్మ పోయిందండి.

మరొక బాలుడు - మేష్టారండి. వట్టిదండి. ఈ వేళ, నే చూశానండి!

మే - ఏమిరా, వెధవా! బతుకున్న వాళ్ళమీదే వొట్లు?

సో - మా బామ్మ పోయినట్లు మా నాన్న ప్రమాణిక్యం చేసి నెల తిరిగిందండి.

అల్లుడు - చూడండి, అత్తా! తొమ్మిదిగంటల బండికి వెళ్ళాలి. వంట త్వరగా కానీండి.

అత్త - అడ్డమా! తొమ్మిదిదాకా ఎందుకు నాయనా, రెండింటికి అయిపోతూంటేనూ!

రామయ్య - భీమారావు! సోమన్న దగ్గిర ఎంత ఉందని నీ తాత్పర్యం. క్రియమాట.

భీ- పది లకారాలుండచ్చు. నీ ఊహ?

రా పది లకారాలు లెక్కేమిటి? డెబ్బై పిల్లకూన్ల పైమాట.

తెల్లారక గదిలోనించే

దత్తుడు - ఒరేయి, భంట్రోత్ ! సూర్యోదయం అయిందేమో, చూడు.

భం - అంతా చీకటిగా ఉంది బాబూ, అయిందేమో, ఏమీ కనిపించడంలేదు.

 - ఏమిరా పొగరూ! కనిపించకపోతే దీపబ్బుద్ధి పట్టుకువెళ్ళి చూడాలని తెలియదూ?

భం - చిత్తం. అగ్గిపెట్టి తమదగ్గరే ఉంది.

దత్తుడు గారి భార్య పోనీ నిప్పుపుడక మీదగ్గరే ఉంటే మన పాతికరూపాయల కొత్తలాంతరు ముట్టించి ఇయ్యండి, పాపం! బుడ్డి వెతుక్కుంటాడూ!........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?