Logili Books

Short Stories

Bora Chekku Marikonni Kathalu

By Dr Chandra Shekar Indla

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bora Chekku Marikonni Kathalu
Publisher
Bhodhi Foundation
ISBN
MANIMN6535
Binding
Papar back
Published Date
Sep, 2025
Number Of Pages
141
Language
Telugu
Availability
In Stock
About this book

నేను, నాన్న, బిర్యానీ

'బాగా ఆకలైనప్పుడు అన్నం తింటే ఏముంటుంది ఆనందం! బిర్యానీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో చికెన్ బిర్యానీ అయితే చంపేసిద్ది. మిట్ట మధ్యాహ్నం ఒంగోలు ఇస్మాయేల్ బిర్యానీ హోటల్ ఏసీలో కూర్చుని, చొక్కా పైగుండీ విప్పదీసి, కాలర్ పైకెగరేసి, ఎడమ చేతిలో మూత తీసిన చల్లని పెప్సీ బాటిల్ పట్టుకుని, వేడివేడి చికెన్ బిర్యానీలో కొంచెం సారువా పోసి, దానిమీద నిమ్మకాయ పిండుకొని, రెండు ఉల్లిపాయముక్కలని ముద్దలో గుచ్చి, మెత్తటి చికెన్ ముక్కని సుతిమెత్తగా తుంచి ముద్దతో పాటు నోట్లో పెట్టుకుంటే, అబ్బా ! దీనెమ్మ జీవితం...' “సార్ ఏంద్సార్ నవులుతున్నారు?”

ఒక్కసారిగా నా బిర్యానీ ప్లేటును లాగేసుకున్నట్లుగా అడిగాడు, ముందులైన్లో కూర్చున్న పొట్టెంకటేసుగోడు.

పిల్లలందరూ పకపక నవ్వారు.

ఇస్మాయేల్ హోటల్లో ఉండాల్సిన నేను కందులూరు నిర్మల్ విద్యానికేతన్ స్కూల్లో కొచ్చేశాను.

"వోయ్ నవ్వింజాల్లే చదువుకోండి” అన్నాను బెత్తం తీసుకొని కుర్చీలోంచి పైకి లేస్తూ. పావురాలన్నీ ఒక్కసారిగా లేచినట్టు శబ్దం చేస్తూ చదవడం మొదలెట్టారు. పిల్లలు. టైమ్ చూస్తే 12 గం॥ 15 ని॥ స్కూల్ వదలడానికి ఇంకో పదిహేను నిమిషాలుంది. 'ఈ రోజు ఎలాగైనా బిర్యానీ తినాలి.' ఇస్మాయేల్ హోటల్లో బిర్యానీ తిని ఇప్పటికే వారం రోజులయ్యింది. .........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?