Logili Books

Children Stories

Champaka Samrajyam

By Vasundhara

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Champaka Samrajyam
Author
Publisher
Classic Books
ISBN
MANIMN6592
Binding
Papar back
Published Date
Oct, 2025
Number Of Pages
137
Language
Telugu
Availability
In Stock
About this book

చంపక సామ్రాజ్యం

ఒకానొకప్పుడు రసాల దేశంలో స్వర్ణగుప్తుడనే ధనవంతుడుండేవాడు. అతడి సిరిసంపదలకు పరిమితి లేదు. అతడికి కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం గల భూములూ, ఎన్నో రకాల వ్యాపారాలూ ఉన్నాయి. విలువ కట్టడానికి సాధ్యంకాని మేలు రకం వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అతడివద్ద లెక్కకు మించి ఉన్నాయి.

ఇంత ధనానికి అధిపతి కావడానికి స్వర్ణగుప్తుడు కేవలం న్యాయమార్గాలే అవలంబించాడని చెప్పడం కష్టం. వ్యాపారమన్నాక అంతో ఇంతో మోసం ఉంటుంది కదా! అయినా స్వర్ణగుప్తుడు డబ్బు సంపాదించడానికి వీలైనంత వరకూ న్యాయమార్గాన్నే అనుసరించాడనడానికి ఒక సాక్ష్యముంది. అది అతడి మంచి మనసు.

స్వర్ణగుప్తుడి సహాయంతో ఎందరో పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివారు. అతడి సాయంతో ఎందరో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారస్థులయ్యారు. అతడు ధనహీనులకి తక్కువ వడ్డీమీద అప్పులిస్తూంటాడు.

ఇవన్నీకాక దరిద్రుల కోసం అతడు తరచుగా అన్నదానాలు చేస్తూంటాడు.

స్వర్ణగుప్తుడు మంచివాడనడానికి కేవలం ఈ దానాలూ, సహాయాలూ మాత్రమే కారణం కాదు. అతడిలో ప్రేమ ఉంది. హృదయంలో ప్రేమ ఉన్న ఏ మనిషీ కూడా చెడ్డవాడు కాలేడు కదా! మరి స్వర్ణగుప్తుడి ప్రేమయితే ఇంతా అంతా కాదు.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?