• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Chandamama Shiva Puranam

Chandamama Shiva Puranam By Katha Prapancham

₹ 200

శివ పురాణం

పూర్వ ప్రపంచ జలమయమై, పదార్థబాన్యమై, అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది. కాలక్రమాన అది జ్యోతిర్లింగా స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అనీ, మహామాయ అనీ పిలుస్తారు.

కాలక్రమాన పరమేశ్వరీ పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాల నిడివి ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో అయిదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో బాటే సరస్వతీ పుట్టింది. 

ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వఅధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదట ప్రత్యక్షమయాడు. తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి, "ఎవరు నువు? ఇక్కడికెందుకు వచ్చావు?" అని అడిగాడు.

"సృష్టి చేయటానికి నిన్ను నా నాభి కమలం నుంచి పుట్టించాను. నేను.................

  • Title :Chandamama Shiva Puranam
  • Author :Katha Prapancham
  • Publisher :Katha Prapancham
  • ISBN :MANIMN6145
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :178
  • Language :Telugu
  • Availability :instock