₹ 100
భారతి కథలు అభివృద్ధి చెందుతున్న భారతదేశపు క్రీనీడలను చూపించిన కాగడాలు. నగర మధ్యతరగతి భద్రజీవుల కథలు కావివి. కులం రీత్యా వర్గం రీత్యా సమాజపు అంచులలోనుంచి ఇంకా నడిమధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు. తన అమ్మనుడిలోనే చెప్పుకున్న ఈ కథలను, భారతి వర్ణించి మాజిక్కులు చేసి ఏమి చెప్పదు. నెత్తిమీద మెట్టి చెప్పదు. ఉపన్యాసాలు ఇవ్వదు. కబుర్లు చెప్పినట్టు చెప్పి ఉలిక్కి పడేలా చేస్తుంది. చివర్లో కొన్ని జీవితసత్యాలను అలవోకగా మన మీదకి విసురుతుంది చాలా ఒడుపుగా. ఇవి ఒక్క దిగవబురాజు కతలే కావు. భారతదేశపు కథలు. భారతి చెప్పిన వెతలు. తెలుగు కథావనంలోకి పచ్చపచ్చగా నడిచి వచ్చింది ఈ కథాభారతి. స్వాగతం పలుకుదాం.
- Title :Edhari Bathukulu Pallekathalu
- Author :Endapalli Bharathi
- Publisher :Hyderabad Books Trust
- ISBN :MANIMN1587
- Binding :Paerback
- Published Date :2018
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock