Logili Books

Autobiography and Biography

Enaleni Spoorthi ( Fidel Castro)

By C Vasantha Bhanu

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Enaleni Spoorthi ( Fidel Castro)
Publisher
Praja Shakthi Book House
ISBN
MANIMN7134
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
144
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట

క్యూబా విప్లవ నేత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫైడెల్ కాస్ట్రో శతజయంతిని ఆగస్టు 13న ప్రపంచంలోని పురోగామి శక్తులన్నీ ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించిన కాస్ట్రో 2016 నవంబర్ 25న రాజధాని హవానాలో మరణించారు. 90 ఏళ్ల నిండు జీవితంలో కాస్ట్రో క్యూబా ప్రజలకే కాకుండా విశ్వ మానవాళికి చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి అద్వితీయమైనవి. సహచరుడు చే గువేరా, సోదరుడు రావుల్ కాస్ట్రో తదితరులతో కలిసి ఆయన 1959లో క్యూబాలో విప్లవాన్ని సాధించడం ద్వారా, అమెరికా తన “పెరటి దొడ్డి"గా భావిస్తున్న లాటిన్ అమెరికా ఖండంలో విప్లవాలకు తలుపులు తెరిచాడు. కాస్ట్రో కృషి క్యూబాకు మాత్రమే పరిమితమైనది కాదు. క్యూబా విప్లవ సాధనలోనూ, అక్కడ సోషలిజం నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా వలస విముక్తి పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సాయాన్ని అందించడం లోనూ, ప్రపంచంలో ఎక్కడ విపత్తులు జరిగినా అక్కడికి క్యూబా వైద్యులను, సహాయక సిబ్బందిని పంపించి ప్రజలకు సేవలు అందించడంలోనూ, లాటిన్ అమెరికా ఖండంలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటులోనూ కాస్ట్రో చేసిన ఎనలేని కృషి ఆయనను గొప్ప అంతర్జాతీయ నేతగా, విశ్వమానవాళి సంక్షేమాన్ని కాంక్షించే మానవతా వాదిగా నిలిపాయి.

శతజయంతి సందర్భంగా ఫైడెల్ కాస్ట్రో విశ్వమానవాళికి చేసిన సేవలను స్మరించుకోవడంతోపాటు ఆయన అందించిన విప్లవ వారసత్వాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తిని నేటి యువతరానికి బదిలీ చేయడం అవసరం. అందునా ప్రపంచ మంతటా, మన దేశంలోనూ మితవాద శక్తుల రాజకీయ కుట్రలపై జెని తరం తిరుగుబాటు చేస్తున్న ఈ సమయంలో ఇది మరింత అవసరం.

మొదటిది, క్యూబా విప్లవంలో కాస్ట్రో నిర్వహించిన నాయకత్వం పాత్ర : క్యూబాలో విప్లవం సాధించే నాటికి కాస్ట్రో 33 ఏళ్ల యువకుడు. విద్యార్థి దశ నుండే ఆయన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాడు. క్యూబాలోని వనరులన్నిటిపై అమెరికా సామ్రాజ్యవాదులు పెత్తనం సాగిస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తుండడం, దీనికి నిరంకుశ క్యూబా పాలకులు వత్తాసు పలకడం నాటి యువతరం సహించలేకపోయింది. ఈ దోపిడీ విధానాలపై పోరాట బావుటా ఎగురవేసింది. కాస్ట్రో అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు, నాయకత్వం వహించాడు. అమెరికా సాయంతో ఆ...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?