• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gali Poralu

Gali Poralu By B Ajay Prasad

₹ 250

నివురుగప్పుకున్న (కథలు) నిప్పులు మధురాంతకం నరేంద్ర

చలికాలపు తెల్లవారుజాముల్లో మంచు కురుస్తున్నప్పటి మసక వెలుతుర్లూ, నిద్రకూ మెలకువకూ మధ్యలో వుండే సుషుప్త సమయాలూ, నిన్న కాసిన యెండ జ్ఞాపకాలూ, చావుకూ బతుక్కూ మధ్య వేలాడే సన్నటి తెరలూ, రాత్రి తలలో తురుముకున్న మల్లెల వాసనల్ని మోసుకొచ్చే వుదయాలూ, చలిలో నానిన నిద్రలేని ముఖాలూ, దుప్పటి మడతల మధ్య లోయలోకి జారిన నక్షత్రాల్లా మినుకుమినుకుమనే ముక్కు పుల్లలూ, నిద్రమత్తులో వుంటే చెవుల్లోకి దూరీదూరని మాటలూ, గాలిలోకి తెరుచుకునే కళ్ళపైన కమ్ముకునే నీడలూ, వులిక్కిపడేలా నిద్రలోంచి లేపేసే కలవరింతలూ, మోటారు వాహనాల రొదల్లోంచీ ముక్కలై విరిగిపడే సంభాషణలూ, చెమటకు తడిసి కనిపించీ కనిపించకుండా మిగిలే బొట్లూ, మసక వెలుతుర్లో తేరిపారజూస్తేగాని కనిపించని మనుషులూ, పొద్దువాలే సంధ్యాసమయాల్లో దాగిపోయే నవ్వులూ, సగం తెరిచిన తలుపుల వెనక తారట్లాడే చీకట్లు, కూలినగోడలూ పిచ్చిమొక్కల వెనక దాక్కునే పురాతన మహిడీలూ వెరసి అజయ్ ప్రసాద్ కథలనిండా నిప్పుల్ని దాచేసే నివురులే దోబూచులాడుతూవుంటాయ్.

తెల్లగా కప్పేసిన బూడిదకింద యెర్రెర్రని నిప్పుకణికలు మండుతూనే వున్నాయని తెలుసుకోవడం కష్టం. సనసన్నగా పలచగా వస్తున్న పొగల్ని చూసి అక్కడ నిప్పు ఆరిపోయిందని భ్రమలో పడిపోతాం. చేతనకూ, అచేతనకూ మధ్య వెంట్రుక కంటే సన్నగావుండే వుపచేతనే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశించినట్టుగానే నిప్పును కప్పిన............

  • Title :Gali Poralu
  • Author :B Ajay Prasad
  • Publisher :Bhodi Foundeation
  • ISBN :MANIMN4064
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :249
  • Language :Telugu
  • Availability :instock