వెట్టి మాదిగ
'అజ్ఞాతవాసి' భాగ్యరెడ్డి వర్మ
పోలీసు పటేలగు రామిరెడ్డి గ్రామ చావడిపై కూర్చొని యుండెను. అతడేదో తొందర పనిచే మనోవైకల్యము గలవానివలె గన్పట్టుచుండెను. రామిరెడ్డి గ్రామము నందు పలుకుబడిగల రెడ్డి కుటుంబమున జన్మించెను. ఈతనికి సుమారు రెండువందల ఎకరముల భూమిగలదు. దీని వలన సంవత్సరమునకు ఇంచుమించు ఐదారు వందల యాదాయము వచ్చును. మన రెడ్డి గారికి తెనుగు నందును, ఉరుదూ భాషయందును కొంత జ్ఞానము కలదు. ఐనను వాక్పటిమలో నీతని సరిపోలు పోలీసు పటేండ్లు అరుదుగా నుందురు. గ్రామములో ఒకనితో నింకొకనికి కలహములు కలిగించుట యందతనికి పెట్టినది పేరు.
గ్రామములో రెడ్డిగారిని మనసార దూషించనివారులేరని చెప్పిన తప్పు కాదు. ఐనను వీరికి జంకియో లేక వారితో నేదేని పని గలుగుననియో అందరును వీరిని గౌరవభక్తులతో జూతురు. రెడ్డిగారితో కించిద్విరోధ మెవరికైన గలిగెనా నతడు అచటినుండి వేరొక గ్రామమునకు లేచిపోవలసినదే. లేనిచో నతడు కష్టనష్టములకు పాలగుటయేగాక కొద్ది దినములలోనే యేదేని నేరము క్రింద న్యాయస్థానమున కీడ్వబడి నేరారోపితుడై శిక్షకు పాత్రుడైన కావలయును. లేదా దండుగలపాలై 'అన్నమో రామచంద్రా' యను సప్తాక్షరి మంత్రోపాసననైనను చేయవలయును. ఈ కారణమువలననే చండశాసనుడగు రామిరెడ్డిగారంటే గ్రామ ప్రజలకు భయము.
రామిరెడ్డిగారి కత్యవసరమైన కార్యముపై మూడామడదూరముపైనున్న యతని బంధువుని యింటికి యుత్తరము పంపవలసియుండెను. తలారిని యూరివంతు మాదిగను పిలుచుకొని వచ్చుటకై పంపెను. కాని తలారి రిక్త..........................