• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gelichi Odi Gelichina Hinduvula Banduvu Trump

Gelichi Odi Gelichina Hinduvula Banduvu Trump By Acharya Yarlagadda Lakshmi Prasad

₹ 150

హిందువుల బంధువు ట్రంప్ - అపూర్వ విజయం

డోనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా మరల ఎన్నికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ జీవితమంతా సంచలనాల మయమే. ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి నాలుగు సంవత్సరాలు అమెరికా అధ్యక్షునిగా సంచలనాత్మక నిర్ణయాలతో పనిచేశారు. మరల ఎన్నికలలో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, తన అనుయాయులను క్యాపిటల్ భవనంపైకి దాడి చేయమని పురి కొలిపారు. ఆయనపై పలుకేసులు పెట్టబడ్డాయి. లైంగిక వేధింపులకు గురిచేసాడని కూడా కొందరు మహిళలు ఆరోపణలు చేశారు. కొన్ని కోర్టులు శిక్షలు కూడా విధించాయి. శిక్షలు విధించిన జడ్జీలపై ట్రంప్ కూడా నోరు పారేసుకున్నారు. ప్రపంచమంతా ట్రంప్ పని అయిపోయిందనుకున్నారు. కానీ రిపబ్లికన్ పార్టీ మాత్రం పెద్ద వ్యతిరేకత లేకుండానే ట్రంపు మరల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ను అధ్యక్ష అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస న్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది.

కానీ జో బైడెన్ వయస్సురీత్యా సరిగా వ్యవహరించడం లేదని మతిమరుపు ఎక్కువయ్యిందని, ట్రంప్తో దీటుగా ప్రచారం చేయలేకపోతున్నాడని డెమోక్రటిక్ పార్టీలో ముఖ్యులు భావించారు.

అనూహ్యంగా జో బైడెన్ కూడా తన ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఉపాధ్యక్షురాలిగా ఉండి, మరల తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా.................................

  • Title :Gelichi Odi Gelichina Hinduvula Banduvu Trump
  • Author :Acharya Yarlagadda Lakshmi Prasad
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6029
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :171
  • Language :Telugu
  • Availability :instock