• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Harshaayanam Maa Voollamandhara

Harshaayanam Maa Voollamandhara By Harsha Vardhan

₹ 150

మా అమ్మ తప్పిపోయింది

"అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం. నాకు మాతృస్వామ్యం ఇష్టం కాబట్టి, అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టానన్నమాట. ఇటు నుండి అటు వెళ్లాలన్నా, అటు నుండి ఇటు రావాలన్నా రాజుపాళెంలో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏమిటబ్బా అని చిన్నప్పటి నుండి డౌట్. కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది. పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన్టీఆర్ రాకముందు మదరాసీలం కదా..." నా దోవన నేను కత చెప్పుకుంటా పోతున్నా.

"అబ్బా! ఈ గోల వదిలెయ్యెహే.. చెప్పాల్సింది చెప్పు, ఈమధ్య అసలు కంటే కొసరెక్కువయ్యింది నీకు" అని పొడస్తావుంది సుప్రియ పక్కనజేరి. సరే, అసలు కథ చెప్తా అని మొదలెట్టా.

నాకు ఐదేళ్ల వయస్సనుకుంటా, కాకపోతే అప్పటికే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగాకులు ఎక్కువే చదివా. మన గోపిగాడి లాగ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివెయ్యగలుగుతున్నా. అత్తారిళ్ల మీద అలకతీరినంక మా అమ్మ వాళ్ళ అమ్మగారింటి నుండి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది. మనమూ ఆమెతో పాటు ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చొక్కా వేసి బయలుదేరాము.....................

  • Title :Harshaayanam Maa Voollamandhara
  • Author :Harsha Vardhan
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN5227
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :165
  • Language :Telugu
  • Availability :instock