Logili Books

Devotional and Religion

Kaivalya Navaneethamu

By Raavi Mohana Rao

₹450
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kaivalya Navaneethamu
Publisher
Mohan Publications
ISBN
MANIMN3270
Binding
Papar Back
Published Date
May, 2022
Number Of Pages
496
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ సద్గురుపరబ్రహ్మణేనమః

కైవల్యనవనీతము-టీకాతాత్పర్యసహితము

తత్త్వబోధప్రకరణము

అవ :- కైవల్యనవనీతమనెడు సకలోపనిషత్సారమైన యీ యద్వైతశాస్త్రమంతయు నిత్యమంగళస్వరూపమైనను "సమాప్తి కామో మంగళమాచరేత, విఘ్నధ్వంసకామో మంగళ మాచరేత” అను శిష్టాచారమునుబట్టి ఆస్తికమతావలంబనులగు జనులకు "అస్మద్గురుభి ర్మంగళమాచరితమ్, అస్మాభిరపి మంగళమాచరితవ్యమ్” అను ప్రమాణములు తెలియుటకై "శ్లో. ఓంకారశ్చాడ శబ్దశ్చ ద్వావేతా బ్రహ్మణః పురా| కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మా న్మాజళికా వుభా” అను స్మృతినిబట్టి యీగ్రంథాదిని ప్రణవాకారపరబ్రహ్మము శ్రీకైవల్యఖదైకపా త్తనుపద్యముచేత స్తుతింపఁబడుచున్నది. శా॥ శ్రీకైవల్యఖదైకపాత్రిపదలక్ష్మీసంయుతోద్గీధస

ల్లోకాలోకకలైకమత్యపరమాలోకాత్మమై యెద్ది యస్తోకానందముఖాంకపంచకలనా సువ్యక్తమై యొప్పు నా

శ్రీకైవల్యనవోద్ధృతార్థము సదా సేవించి కీర్తించెదన్. టీక:- ఎద్ది ఏప్రణవాకారపరబ్రహ్మము, శ్రీకైవల్య.... కాత్మమై, శ్రీ ధర్మార్థకామము లనెడి త్రివర్గముయొక్కయు, కైవల్య = మోక్షముయొక్కయు, ఖ=సుఖములను, ద ఇచ్చునట్టి, ఏకపాత్=(పాదో2స్య విశ్వాభూతాని) అను శ్రుతిచేత ఒక్కటియై ఆకారాత్మకమైన అవిద్యాపాదము యొక్కయు, త్రిపద=(త్రిపాదస్యామృతం దివి) అనుశ్రుతిచేత మూఁడైన ఉకారమకారార్థమాత్రస్వరూపములైన విద్యాపాదానంద పాదతురీయపాదములయొక్కయు, లక్ష్మి-సంపదలతోడ, సంయుత = కూడిన, ఉద్ధీక్ష= బ్రహ్మప్రణవమందలి, సత్ = శ్రేష్ఠములైన, లోకాలోకకలా= ప్రకృతిమయములగు పదునైదుకలలయొక్కయు, ఐకమత్య =మేళనముచేత,..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?