అశేషానుభవ సంపన్న చరిత్ర రాయసం అశేరా
ఒక వ్యక్తితో పరిచయం స్నేహంగా కొనసాగి, ఆత్మీయతతో అల్లుకుని, ఆ ప్రభావవంతమైన ప్రతిభ తనను గైడ్ చేసినందువల్ల, తనకా బాట సుగమం అయిందని, బాటలో కలిసిన ప్రతి అనుభవ స్మృతిని, మనసులో నింపుకుని ఇట్లా కలంలో ఒంపుకుంటున్న మైత్రేయుడు అశేరా.
“Ideas shape the course of history." అని జాన్ మేనార్డ్ కీన్స్ మాట.
చరిత్ర, చరిత్రలో పురాచరిత్ర, గుడులు, గోపురాలు, శిల్పాలు, వాటి కొరకు వెతుకులాట, దూరభారాల పయనాలు, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు, చిన్న, చిన్న వస్తు సంపదల పట్ల కొత్త ప్రేమలు, అద్భుతమేదో సాధించిన మానసికానందాలు... ఈ చారిత్రకాన్వేషకులకు సహజం.
ఒకసారి ఆర్కియాలజిస్టుతో సహవాసం, సాహచర్యం సాహసాలతో కూడుకొన్నదే. ఏదన్నా కనుగొన్నారా (కనుగొనడం అంటే కంటితో కనడమే, డిస్కవరీ అంటే Dis+Cover అంటే కప్పి వున్న దానిని తొలగించి చూడడమే) అంతే... ఇక దాని లోతుపాతులు తీసేదాకా ఊపిరి మరిచిపోయి పనిచేస్తుంటారు కొందరు నిబద్ధులైన పురావేత్తలు. అశేరా దృష్టిలోపడ్డ వృత్తి ఆర్కియాలజిస్టు అనంతపురం కల్లూరు సుబ్బారావు స్మారక ఆర్కియాలజీ మ్యూజియం అండ్ పురావస్తుశాఖలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ గౌరవనీయులు విజయకుమార్ జాదవ్ సార్. తనను 1996 మార్చిలోనో, ఏప్రిల్లోనో కలిసాడు అశేరా అనబడు అడవుల శేషగిరి రాయుడు.....................