• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kulam Viplavodhyamam

Kulam Viplavodhyamam By N Ravi

₹ 120

రచయిత మాట

మేం కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్ కమిషన్ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్ రావు కమిషన్ నివేదిక ఆధారంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం. అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో ముడిపడిన ప్రశ్నలను మొదటి నుండి ఏదో ఒక మేరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మా విప్లవ ప్రస్థానం సాగింది. ఈ ప్రశ్నల నేపథ్యంలోనే జీవితంలో మొదటిసారిగా జ్యోతి రావు ఫూలేతో పాటు బ్రాహ్మణవాద వ్యతిరేక పోరాటం చేసిన ఎందరో సాంఘిక విప్లవకారులు గురించి తెలుసుకున్నాం. అకడమిక్ చదువులలో భాగంగా తెలుసుకున్న అంబేడ్కర్ను మాత్రమే కాకుండా కుల నిర్మూలన గురించి ఆయన పడిన తపనను, పోరాటాలను, సిద్ధాంతాన్ని ఏదో మేరకు తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాము.

విప్లవోద్యమం కుల సమస్య పట్ల విస్పష్టమైన వైఖరిని తన అవగాహనా పత్రం ద్వారా వెల్లడించడం ఈ విషయం పట్ల సాపేక్షికంగానైనా సమగ్ర దృష్టి అలవర్చుకోవడానికి తోడ్పడింది. మేము బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో విప్లవోద్యమంలో పని చేయడానికి వెళ్లడం వల్ల మన దేశంలోని కులాల డైనమిక్స్ను మరింత విశాలంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఏదేమైనా విప్లవోద్యమం ఆచరణలో ప్రజా పంథాను అమలు పరచడంలో భాగంగా ప్రజల నుండి నేర్చుకోవడానికి ఎట్లాగైతే ప్రాముఖ్యతను ఇస్తుందో అట్లాగే సైద్ధాంతిక రంగంలో కూడా విభిన్న ఉద్యమాలు, అస్తిత్వ సమూహాలు ఆచరణకు సంబంధించి, సైద్ధాంతిక విషయాలకు సంబంధించి లేవనెత్తిన అంశాలను అర్థం చేసుకోవడానికి, అవగాహనను మెరుగు.,..............

  • Title :Kulam Viplavodhyamam
  • Author :N Ravi
  • Publisher :Change Publicaions
  • ISBN :MANIMN5765
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :135
  • Language :Telugu
  • Availability :instock