Logili Books

Short Stories

Liyam Prema Katha

By Pramela Suryadevara

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Liyam Prema Katha
Publisher
Surya Publications
ISBN
MANIMN7191
Binding
Paparback
Published Date
March, 2026
Number Of Pages
153
Language
Telugu
Availability
In Stock
About this book

లియమ్ ప్రేమ కథ

“ఏమండీ మిమ్మల్నే” చాటలో బియ్యం పోసుకుని వరండాలో ఉయ్యాల బల్లపై పడుకుని కునికిపాట్లు పడుతున్న భర్త దగ్గరకొచ్చింది యశోదమ్మగారు.

వారం రోజులుగా ఇదే పోరు అని విసుక్కుంటూ, పొట్టమీద ఉన్న ఈనాడు దినపత్రిక ముఖం మీదకు లాక్కుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు పరంధామయ్యగారు.

“నాకు రాత్రి వాడు కలలోకొచ్చాడు, చిక్కి సగమై ఉన్నాడు బిడ్డ. దేశంకాని దేశంలో ఏం తింటున్నాడో ఎలా ఉన్నాడోనని తలుచుకున్న కొలదీ నా గుండె బరువెక్కి పోతోంది” కళ్ళు తుడుచుకుంటూ అన్నది.

భార్య కన్నీరు చూడగానే కరిగిపోయాడు పరంధామయ్యగారు. ముఖంమీది పేపర్ తీసి మడతపెడ్తూ “వాడేమైనా హైదరాబాద్లోనో లేక ముంబాయిలోనో ఉన్నాడనుకున్నావా? అనుకున్నప్పుడల్లా వెళ్ళి చూడ్డానికి. అమెరికాలో ఉన్నాడు. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. ఆ తరువాత వీసా రావాలి. జయదేవ్తో చెప్పాను కదా పాస్పోర్టీకి అప్లికేషన్ పంపించాలని. ఇవ్వాళో రేపో వస్తానన్నాడు. విదేశాలకు వెళ్ళే వారికి పాస్పోర్టు, వీసాలు కావలసిన వారికి అప్లికేషన్స్ పెట్టించి అవి రాగానే డబ్బులు వసూలు చేసుకుంటాడు జయదేవ్. పాస్పోర్ట్ రావటానికి ఆరు వారాల నుంచి మూడు నెలల వరకు పడుతుందట. ఆ తరువాత వీసాకు మరొక మూడు నెలలు. నాకు మాత్రం వాడిని చూడాలని లేదూ!" అనునయంగా అన్నాడు.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?