• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Maktub

Maktub By .

₹ 350

ఒక బాటసారి ఒక గ్రామం మధ్యలో కూర్చొని ఎదురుగా ఉన్న నిరాడంబరమైన ఇంటిని చూస్తున్నాడు. ఇంతకు ముందు స్నేహితులతో కలిసి అతను అక్కడకు వెళ్లాడు. అప్పుడు అతను ఆ ఇంటి శైలికి, చాలా కాలం క్రితం అక్కడ నివసించినా, ఎంతోకాలంగా ఆ ప్రదేశంలో ఎప్పుడూ అడుగు పెట్టని కాటలాన్ వాస్తుశిల్పి శైలికి, మధ్య సారూప్యతను మాత్రమే గమనించాడు. రియో డి జనీరో లోని కాబో ఫ్రియోకు దగ్గరగా ఉన్న ఆ ఇల్లు పూర్తిగా నిరుపయోగమైన శకలాలతో నిర్మించబడింది. 1899లో, దాని యజమాని గాబ్రియేల్ కు ఒక కల వచ్చింది, ఆ కలలో ఒక దేవదూత అతనితో "శకలాలతో ఒక ఇంటిని నిర్మించు.” అన్నాడు. గాబ్రియేల్ పగిలిన టైల్స్, ప్లేట్లు, ఆభరణాలు, విరిగిన కుండ పెంకులను సేకరించడం ప్రారంభించాడు. "ప్రతి శకలం అందంగా రూపాంతరం చెందింది" అని గాబ్రియేల్ తన పని గురించి వివరిస్తూ చెప్పాడు.

మొదటి నలభై సంవత్సరాలు, స్థానికులు అతను పిచ్చివాడనుకున్నారు, కాని కొంతమంది పర్యాటకులు ఆ ఇంటిగురించి తెలుసుకుని వారి స్నేహితులను తీసుకురావడం ప్రారంభించినప్పుడు, గాబ్రియేల్ మేధావి గా పరిగణింపబడ్డాడు. అయితే అది కూడా ఎంతో కాలం నిలవలేదు. గాబ్రియేల్ మరోసారి అజ్ఞాతంలోకి నెట్టబడ్డాడు. అయినప్పటికీ, అతను తన ఇంటిని నిర్మించడం మానలేదు. అలా నిర్మాణం కొనసాగించి తన తొంభై మూడు సంవత్సరాల వయస్సులో, ఆ ఇంటి నిర్మాణంలో చివరి గాజు ముక్కను ఉంచి మరణించాడు.

ఒక యాత్రికుడు సిగరెట్ వెలిగించి నిశ్శబ్దంగా ధూమపానం చేస్తున్నాడు. ఈ రోజు, అతను గాబ్రియేల్ ఇల్లు, ఆంటోనీ గౌడి వాస్తుశిల్పం మధ్య.....................

  • Title :Maktub
  • Author :.
  • ISBN :MANIMN5839
  • Language :Telugu
  • Availability :instock