మేఘదూతము ప్రథమసర్గ
శ్లో॥ కశ్చితావిరహగరుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్త్రంగమితమహిమా వర్షభోగ్యేన భర్తుః
యక్షశ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
స్నిగ్ధయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥
తా. కుబేరుని సేవకుడైన యక్షుడొకడు విధినిర్వహణలో తప్పు చేశాడు. అందుకు కోపించిన కుబేరుడతణ్ణి ఒక ఏడాది ఇంటికి, ఇల్లాలికి దూరంగా పొమ్మని శపించాడు. శాపానికి గురియైన యక్షుడు భూలోకం వచ్చాడు. వనవాసకాలంలో జానకీదేవి స్నానం చేసినందున పవిత్రమైన నదీజలాలు, చల్లని నీడనిచ్చే ఎత్తైన, దట్టమైన చెట్లున్న రామగిరికి చేరి నివాసం ఏర్పరచుకున్నాడు.
చం. ధనదునిభృత్యు డొక్కతఱి దా నిజధర్మ మతిక్రమింప దత్
క్షణమ శపించినన్ నిజపదచ్యుతు డై యొకయేడు కాలమున్
వనితకు దూర మై జనకనందిని గ్రుంకినదివ్యవాహినీ
వనముల శక్తి వాసి నిజవాసము గాగ తదీయసీమలన్
ఘనవిరహార్తి జిత్రగిరి గాలము వుచ్చెను శోకతప్తుడై.............