• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mythri Neelothpala

Mythri Neelothpala By Neelothpala Sistla

₹ 250

తొలి పరిచయం

ఇది నా చిన్న వయసప్పటి సంగతి, కృష్ణునితో నా తొలి పరిచయం మా గురుకులంలో ఉండగా జరిగింది. మా నాన్నగారైన పాండురాజు కాలం చేసిన కొన్ని రోజులకి మేము హస్తినకు వచ్చి నివాసం ఉండడం మొదలు పెట్టాము. మా మేనమామగారు వసుదేవుని కుమారుడైన కృష్ణుడి గురించి వినటమే కాని మేము వనవాసంలో ఉండటం వల్ల ఎప్పుడూ కలవలేకపోయాము. ఇప్పుడు హస్తిన నుంచి వచ్చి ద్రోణాచార్యుని వద్ద శిష్యరికం చేస్తున్నాము. ఒక రోజు మా గురుకులానికి సమీపములో ఉన్న సాందీపని మహర్షి గురుకులం నుంచి కొంత మంది విద్యార్థులు వచ్చారు. వారిలో కృష్ణుడు ఒకరు.

కృష్ణుడు బహు చమత్కారి. మేము కృష్ణుని గురించి అంత వివరంగా తెలుసుకోకపోయినా, మా గురించి అతడు బాగానే తెలుసుకున్నాడు. వస్తూనే ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. కృష్ణ లీలలు మేము కొంత వింటూ పెరిగాము, చిన్న వయసులోనే భయంకర రాక్షసులైన పూతన, అఘాసురుడు, కంసుడు వంటి వారిని అవలీలగా మట్టుబెట్టాడు.

కాని చూడటానికి ఎంతో నిర్మలంగా, అమాయకంగా ఉన్నాడు. "బావా, ఏంటి సంగతులు?" అని ఎంతో పరిచయం ఉన్నవాడిలాగా పలకరించాడు. నేను, మాధవుడు ఎంతోసేపు మా విద్యాభ్యాసం గురించి మట్లాడుకున్నాము. నా అస్త్రవిద్యని ఎంతో ఆసక్తిగా పరిశీలించాడు. రాబోయే కాలంలో నాకు అస్త్రవిద్యే అక్కరకు వస్తుందని పదే పదే అన్నాడు. అప్పుడు నాకు ఒక విషయం అడగాలి. అనిపించింది. నేను సందేహపడుతూనే అడిగాను "బావా, నువ్వు ఎంతో.....................

  • Title :Mythri Neelothpala
  • Author :Neelothpala Sistla
  • Publisher :Kithab Consulting Company
  • ISBN :MANIMN5946
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :233
  • Language :Telugu
  • Availability :instock