Logili Books

Short Stories

Nallamala Vaalimama Prapancham (Set of 5 Books)

By Suresh Veluguri

₹3000
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nallamala Vaalimama Prapancham (Set of 5 Books)
Publisher
VMRG International Publication
ISBN
MANIMN6784
Binding
Paparback
Published Date
April, 2024
Number Of Pages
1200
Language
Telugu
Availability
In Stock
About this book

'వాలిమామ కథలు' ఎందుకు ప్రత్యేకం?

వాలిమామ కథలు మొత్తం సిరీస్ రాయడానికి నేను తీసుకున్న సుమారు ఎనిమిదిన్నరేళ్ల సమయంలో ఎక్కువ భాగం ... చెంచు సోదరుల జీవితాలు, వాటిలోని వైవిధ్యాలు; వైరుధ్యాలు, జీవనోపాధి మార్గాలు, ఇంకా పలు అంశాల మీదనే దృష్టిపెట్టాను. మరోవైపు వారి భాష, పలుకులు, పలుకుబడులు, వాటిని పలికే తీర్లు, సరిహద్దు యాసల గురించి విడిగా అధ్యయనం చేశాను. బహుశా 1990కి ముందే నేనీ ప్రాజెక్టును మొదలు పెట్టి వున్నట్లయితే సమాచారం లభించే అవకాశం దక్కేది. అప్పటికి నల్లమలలో ఇంకా కొందరైనా నిఖార్సయిన చెంచులు మిగిలివున్నారు. అడవి జీవితాన్ని ప్రతిబింబించేలా వాలిమామ కథల్ని ఇంకాస్త బలంగా రాసే వీలయ్యేది. కానీ, అప్పటికి నేనింకా విద్యార్థి దశలోనే వుండడం వల్ల ఇది సాధ్యపడలేదు. అయితేనేం, వయసు 40 ఏళ్లు దాటాక మళ్లీ మొదలుపెట్టిన ఈ సరికొత్త అధ్యయనం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఫలితంగానే ఈ 117 కథల సిరీస్ ను సాధ్యమైనంత సహజంగా, ఫలవంతంగా పూర్తిచేయగలిగానని భావిస్తున్నాను.

అడవిలో బతుకుతెరువు భారం కావడం వంటి సమస్యల వల్ల పట్టణీకరణ పెరిగింది. పట్టణాలు, నగరాలకు వలసపోయే సాధారణ ప్రజల్లాగే గిరిజనుల వలస కూడా మొదలైంది. ఈ శాతం పెరుగుతూ వస్తున్నప్పటికీ, నిజానికి ఈరోజుకీ అడవిలోనే వుంటూ, తమ బతుకుతెరువును సాధించుకుంటున్న గిరిజనుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఘోరారణ్యాల మధ్య మృగాలతో సహవాసం చేస్తున్నవారి సంఖ్య కూడా పెద్దదే. నా ప్రయాణంలో కొందరు మిత్రుల అండదండలతో నేను నల్లమల లోని చాలా ప్రాంతాలు సందర్శించాను. దిట్టమైన లోతు, మృగాలు తిరుగాడే ఫారెస్ట్ జోన్లలో కూడా సఫారీలు, సొంత కార్లలో ప్రయాణం చేశాను. ఇప్పుడైతే మొత్తం అడవినీ అభయారణ్యంగా ప్రకటించారు. చెంచులు కూడా చాలామంది గ్రామాలకు వలసపోతున్నారు.

ఈ పుస్తకాల సిరీస్ కోసం నేను చేసిన ప్రయాణాల్ని నిజానికి రెండు ప్రయాణాలుగా చూడాలి. అదే నల్లమల అడవికి కేవలం ఆరేడు కిలోమీటర్ల దూరంలోని గిద్దలూరులో పుట్టిపెరగడం తొలి (బాల్య) దశ. ఈ దశలో నలుగురూ చెప్పిన కథలు, అవి మనసులో బలంగా నాటుకుపోవడం; గిద్దలూరు ఫారెస్ట్ డిపో ఉద్యోగులు; మా నాయనమ్మ అంగడికి వచ్చివెళ్లే కొందరు చెంచులతో సావాసం, వారి తర్వాత తరాల పిల్లలు కొందరితో కొనసాగుతున్న సాన్నిహిత్యం - ఇదంతా తొలి దశ. ఈ పుస్తకం కోసం చేసింది రెండో ప్రయాణం. ఈ ప్రయాణం లోనే నేను అనేక కొత్త విషయాల్ని నేర్చుకున్నాను.

ప్రకృతి, పర్యావరణం, అడవులు, వర్షాలు, అడవి జంతువులు, అటవీ ఉత్పత్తులు .... అడవుల్లో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు - వంటి అనేక అంశాల్ని ఇవ్వాల్టి తరం వారికి అర్థమయ్యేలా సున్నితంగా చెప్తూ, పిల్లలు, పెద్దలకు సమానంగా ఉపయోగపడేలా ఈ సిరీస్ ను మీముందుకు తీసుకువచ్చాం. ఈ పుస్తక ప్రచురణను మూడో ప్రయాణం కింద చూడొచ్చేమో..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?