• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Older Understanding

Older Understanding By Bapu

₹ 125

బాబోయ్... అరవై!

మా సరస్వతి రెండు గంటలుగా నిద్ర పోయినట్లు నటిస్తోంది. రోజూ ఈ పాటికి... ఆఫీసులో ఉన్నట్లు 'పలవరింతలు' ఉండేవి. నాకు నాలుగైదు మోచేతి పోట్లు ఉండేవి.

గురక మరీ పెద్దగా కాదు కానీ, నాకు అలవాటైపోయేంతలో... ముక్కు నుంచి మంద్ర స్థాయిలో వాక్యూమ్ క్లీనర్లా గాలి లోపలికి తోడుకుని, పెదవుల మధ్య నుంచి బుల్లెట్ బండి వెళ్తున్నట్లు (కాస్త దూరంగా...) నిశ్వాసగా... శబ్దించేది. నిజం చెప్పద్దూ... ఆ రెండు నాకు జో కొడుతున్నట్లు, జోల పాడుతున్నట్లు ఉండేవి!

ఇవ్వాళ ఆ రెండూ లేవూ అంటే... తన నిద్దుర పోవట్లేదని అర్ధం అయిపోతోంది.

మో చేతుల్తో జొజ్జోలూ, గురకల జోలపాటలూ లేని నిశ్శబ్ద గంభీర నిద్ర నటించడం నాకూ చేతకావట్లేదు.

తన నటన నిర్ధారణ చేసుకుందామని మూసిన కన్నుల్లో కదులుతున్న గుడ్లు చూసి పోల్చుకోవచ్చుగానీ.. ఈ రోజు ముఖం ఉత్తరాభిముఖంగా ముడుచుకుంది.

ఎప్పుడైనా అలకో, చిరాకో వేసినప్పుడు ఇలాంటి నిశ్శబ్ద............

  • Title :Older Understanding
  • Author :Bapu
  • Publisher :Akshagna Publications Prachurana
  • ISBN :MANIMN5200
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :65
  • Language :Telugu
  • Availability :instock