రాత్రి రాసిన ఉత్తరాన్ని పదిలంగా మడిచి కవరులో దాచి అడుగున పెట్టాను. ఉదయం కాస్త తెరిపి ఇచ్చిన వాన మళ్ళీ చుట్టుముట్టింది. ఇంటి చుట్టూ చూరు నుంచి కారే వాన ధారలు పల్లకీ గొట్టాల అలంకారంతో నా మనసును ఊరేగిస్తున్నాయి.
పూల ఋతువు
పరిమిత తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాక సమస్త ప్రపంచాన్నీ మరచి రాస్తోంది. కాదు. ....... కాదు....... రాసుకుంటోంది. 'రాస్తోంది' అంటే మిగిలిన వారి కోసమూ అవుతుంది. 'రాసుకుంటోంది' అంటే కేవలం తన కోసమే అని.
నిజం! పరిమిత కేవలం తన కోసమే రాసుకుంటోంది. తన మనసును అక్షరాల లోకి ప్రవహింపజేయడానికి నీలిరంగు బాల్ పాయింట్ పెన్ని సాధనంగా మలచు కుంటోంది.
మరే! ఈ నీలిరంగు బాల్ పాయింట్ పెన్ అతను ఇచ్చిందే. 'ఇంక్ పెన్' అంటే ఇప్పటి పిల్లలకి తెలియదు కానీ ఆ రోజుల్లో అందరూ అదే వాడేవారు. అలాంటి రోజుల్లో ఈ బాల్ పెన్ కొత్తగా బహుమతిగా అందుకుంది. ఆ పెన్ కేప్ పట్టుకుని అటూ ఇటూ కదిపితే ఒకసారి 'ఐ లవ్ యూ' అనీ, మరోసారి 'ఫరెట్ మి నాట్' అనీ ఇంగ్లీషు అక్షరాలు వచ్చేవి. అలాంటి బాల్ పాయింట్ పెన్ ఆమె మనసులోని ఎన్నో.........................