Logili Books

Novels

Marige Esaru

By Ranganadha Ramachandra Rao

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Marige Esaru
Publisher
Sahitya Acadamy
ISBN
MANIMN6798
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
384
Language
Telugu
Availability
In Stock
About this book

దిబ్బనెక్కి తిరిగి చూసినపుడు

'నిజం, తిరిగి చూస్తున్నాను. చాలా దూరానికి దృష్టిని సారిస్తున్నాను. అక్కడి జ్ఞాపకాలు ఒకసారి వంకరటింకరగా, మరోసారి సరళ రేఖగా కంటి ముందు చిత్రాలు నిర్మిస్తున్నాయి. అన్నింటికీ అక్షర రూపమివ్వటం కష్టం.

ఇంతకూ ఇంతటి కష్టం, ఇష్టం లేని మనస్సుతో వీటన్నింటికీ నమోదు చేయటం అవసరమా అన్నది పెద్ద ప్రశ్న. అవసరం లేదని అనిపించటం వల్లనే చాలా కాలంనుంచీ మౌనంగా ఉన్నాను. గతాన్ని మరిచిపోవటానిని ప్రయత్నించాను. నాకు అదొక సిద్ధి లాంటిది. వరమే అనుకోవచ్చు. వద్దని అనిపిస్తే దాని ఛాయ కూడా తగలకుండా మరిచిపోతాను. జరిగిపోయినదాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సులోకి రానిస్తే, తర్వాతి అడుగులు స్థిరత్వాన్ని పోగొట్టుకుంటాయనే జాగ్రత్త. అంతే.

కానీ పూడుకుపోయిన వ్యథలను ఆప్తులైన కొందరు వెలికితీయటమూ జరిగింది. ఒక విడుదల నిట్టూర్పుకో, నా ప్రవర్తన, నిర్ణయాల తప్పొప్పులను తెలుసుకోవటానికో సాహిత్య రంగంలోని ఒకరిద్దరు స్నేహితులతో గుసగుసగా చెప్పుకున్నాను. వాళ్ళెవరూ ఈ క్షణం వరకూ వాటిలో దేన్నీ దుర్వినియోగం చేసుకోలేదన్నది ఆ స్నేహం విలువను

పెంచింది.

అప్పుడు- ఇప్పుడు వినిపించే స్త్రీవాదంలోని ప్రధానమైన ప్రకటన 'పర్సనల్ ఈజ్ పొలిటికల్' అనే మాటను స్వయం స్ఫూర్తితో నిజం చేసుకున్న ఒక ప్రత్యేక సందర్భం ఉంది. దాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవడం నా కర్తవ్యం.

సుమారు ఎనభై దశకం చివరి భాగం అయివుండాలి. కామ్రేడ్ సిద్దనగౌడ పాటిల్గారు ఒక కార్యక్రమానికి ఆహ్వానించి, వారే తీసుకువెళ్ళారు. రాత్రంతా బస్సు ప్రయాణం. పరస్పర పరిచయాలు, మాటలు-అనేక కొత్త ఆలోచనలవైపు మరలడానికి కారణమయ్యాయి.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?