Logili Books

Devotional and Religion

Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri

By Dr Ashok Kumar Cattarji

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri
Publisher
Sanatan Yogadharma Prasar LLP
ISBN
MANIMN5628
Binding
Papar Back
Published Date
2024
Number Of Pages
405
Language
Telugu
Availability
In Stock
About this book

పురాణ పురుష
 

యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ
 

మొదటి అధ్యాయం
 

ఆవిర్భావం

'శ్యామాచరణ్, ఇలా రా!'

కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారు మోగుతున్నది. శ్యామాచరణులు చకితులయ్యారు.

దట్టమయిన అడవి పెరిగిన ఈ కొండప్రాంతంలో పేరుపెట్టి పిలిచిన వారెవరు? అసలు తనపేరెలా తెలిసింది? ఇంతలో కొండకొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండడం కనిపించింది శ్యామాచరణులకు. ఆయనే తనను పేరుపెట్టి పిలుస్తున్నారు.

కార్యకారణసంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమయిన శంకతో ఊగిసలాడింది. ఈ సందిగ్ధ సంశయస్థితిలోనే శ్యామాచరణులు ముందడుగువేశారు. కొండకొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని, సిద్ధమహాత్ములు, మధుర దరహాసంతో తమను దగ్గరికి పిలిచారు. ఆ మహార్షి నేత్రాల్లో పితృప్రేమ తళుక్కుమంటున్నది. ఎక్కువకాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్నచిత్తులయిన ఆ మహామునికి కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరణులను ఆప్యాయంగా దగ్గరికి చేరబిలిచారు.

తరవాత ఆ మహార్షి ఇలా అన్నారు: "ఏమిటి శ్యామాచరణ్? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇక్కడికి ముందెప్పుడూ వచ్చినట్లు కూడా గుర్తులేదా?........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?