Logili Books

Cinema

Screenplay Master SUKUMAR

By Dr Praveen Yajjala

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Screenplay Master SUKUMAR
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN7162
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
163
Language
Telugu
Availability
In Stock
About this book

సంకల్ప సమర్పణ

"తెలుగునకు వ్యాకరణం చిన్నది" అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారంటారు. ఆ పద్ధతిలోనే చెప్పాలంటే తెలుగు సినిమాకు కథనశాస్త్రం చిన్నది కాదని కాదు, అసలంటూ ఒక సమగ్ర, ప్రామాణిక కథనశాస్త్ర గ్రంథం కొరతగా ఉందని చెప్పాలి. వందల, వేల కోట్ల వ్యాపారంతో, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో సినిమా ఎలా నిర్మితమవుతుంది? కథను కథనంగా ఎలా మలచాలి? దర్శకత్వ శిల్పం అంటే ఏమిటి? కథకూ కథనానికీ మధ్య ఉన్న అంతర్గత వ్యత్యాసం ఏమిటి? వంటి ప్రశ్నలను విశ్లేషించే ప్రామాణిక గ్రంథాలు మరింతగా రావాల్సిన అవసరం ఉంది.

తెలుగు సినిమా ఒక వ్యవస్థాగతమైన పరిశ్రమగా మరింత బలపడాలంటే, సినీ పెద్దలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఈ దిశగా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సినిమా అనుభవం కేవలం వ్యక్తుల నుంచి వ్యక్తులకు సంక్రమించే జ్ఞానంగా కాకుండా, అధ్యయనం చేయగలిగే, బోధించగలిగే, పరిశోధించగలిగే శాస్త్రీయ పరిజ్ఞానంగా ఇంకా ఇంకా బలంగా రూపుదిద్దుకోవాలి. ఆ అవసరంలో నా వంతు బాధ్యతగా ఈ గ్రంథాన్ని రచించాను. నా వంతుగా ఇది కొనసాగించాలని నా బలమైన సంకల్పం.

అరూపంగా ఉండే కథన సిద్ధాంతాలను కేవలం పొడి సిద్ధాంతాల వివరిస్తే అవి పాఠకుడికి సులభంగా బోధపడకపోవచ్చు. అందుకే సుకుమార్ గారి స్క్రీన్ప్లే ప్రయోగాలను ప్రత్యక్ష ఉదాహరణలుగా స్వీకరించి, వాటి ద్వారా కథన సూత్రాలను విశ్లేషించే మార్గాన్ని ఎంచుకున్నాను. సిద్ధాంతాన్ని ఉదాహరణతో, ఉదాహరణను విశ్లేషణతో, విశ్లేషణను సూత్రంతో అనుసంధానించే ప్రయత్నమే ఈ..................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?