Logili Books

Devotional and Religion

333 Mantralu Tantralu Yantralu Sri Vaishnava Sidha Tantralu

By Sri Kondapalli Venkateswarlu M A Llb

₹750
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
333 Mantralu Tantralu Yantralu Sri Vaishnava Sidha Tantralu
Publisher
Mohan Publications
ISBN
MANIMN3711
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
752
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ వైష్ణవ సిద్ధ తంత్రాలు

ముందుగా సంకలన కర్తయైనటువంటి నా గురించి 
పాఠకులతో కొన్ని మంచి మాటలు

మొదటగా ఈ దైవికమైన పవిత్ర గ్రంధరచన, సేకరణ, సంకలనాత్మక కర్తనైన నా గురించి పాఠకదేవుళ్ళకు సవినయంగా మనవి చేసుకోవడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. నేను నెల్లూరు జిల్లాలోని రావిపాడు గ్రామంలో పుణ్యదంపతులైన కొండపల్లి వెంకయ్య, రుక్మిణమ్మ గార్లకు 1954వ సంవత్సరంలో జన్మించాను. మా అమ్మ మహాభక్తురాలు, పుణ్యవంతురాలు, సంస్కారవంతురాలు. మా నాన్నగారు కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉ ండేవారు. 1974లో మా అమ్మ వైకుంఠప్రాప్తి పొందారు. మా నాన్నగారు వీలున్నప్పుడల్లా ధ్యానానికి (ప్రదక్షిణ సేవకు) నా తోటి శ్రీశైలము, ఘటికాచలము (తమిళనాడు) వస్తూ, ఒక మండలము లేక అరమండలము లేక పావు మండలం నాతో ఉండేవారు. నా విద్యాభ్యాసం నెల్లూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ లలో జరిగింది. 1976, 1977వ సంవత్సరాలలో జరిగిన గ్రూప్-4 సర్వీసెస్లో రాష్ట్ర మొదటి ర్యాంకులోను, గ్రూప్-2 విభాగంలోను మామూలు ర్యాంక్ ఉద్యోగాలు పొంది, రాష్ట్ర సచివాలయంలో కొంతకాలము ఉద్యోగం చేశాను. తదుపరి వ్యక్తిగత కారణాలపై గుంటూరు విద్యాశాఖకు బదిలీపై రావడం జరిగింది. 1983 కార్తీకమాసంలో భగవంతుని ఆరాధించాలి అనే నిరంతర తపన నన్ను ధ్యానయోగ సాధనకు పురికొల్పింది. 1977లో నా వివాహం జరిగింది. ఇద్దరు సంతానం ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. 2011వ సంవత్స రంలో నేను పదవీ విరమణ చేయడమైంది.

నేను నాగృహంలో నాబ్రాహ్మణ స్నేహితులసలహా సహకారంతో దేవతా రాధనను మొదలెట్టి తొలుతుగా పరమశివ, మహావిష్ణు, శాక్తేయ, లక్ష్మీ, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, కాలభైరవ, నారసింహ స్తోత్రాలను ఒక్కొక్కటి 11 సార్లకు తక్కువ కాకుండ శుచి శ్రద్ధ భక్తి అనే మూడు అంగాలు పునాదులుగా చేసుకొని ప్రార్థించాను. కొన్నాళ్లకు నా మానసిక స్థితిలోను, బుద్ధిబలం, ఆత్మసెర్యంలోను వచ్చిన మంచి మార్పులను గమనించాను. అదే కాలంలో సత్ గురువు ద్వారా మంత్రోపదేశం పొందాలనే బలమైన కోర్కె నాలోకలిగి సద్గురు లక్షణాలు కల్గిన వారి కొరకు 6 నెలల పాటు అన్వేషించాను. చివరకు ఒక వృద్ధ బ్రాహ్మణ వర్యుల ద్వారా బ్రహ్మ చారి, సద్గుణ, సదాచార సంపన్నులైన.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?