Logili Books

Autobiography and Biography

Tarimela Nagi Reddy ( Jeevitamu, Rajakeyamu)

By Viswam

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tarimela Nagi Reddy ( Jeevitamu, Rajakeyamu)
Author
Publisher
Tarimela Nagi Reddy Memorial Trust
ISBN
MANIMN7147
Binding
Paparback
Published Date
Sep, 2026 2nd print
Number Of Pages
91
Language
Telugu
Availability
In Stock
About this book

తరిమెల నాగిరెడ్డి బాల్యము - విద్యార్థి దశ

అనంతపురం జిల్లా, తరిమెల గ్రామంలో సంపన్న భూస్వామ్య కుటుంబంలో నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11వ తేది జన్మించారు. ఇంటికి తొలి పిల్లవాడు కావడంతో అమితమైన గారాబంతో పెరిగినారు.

బాల్యంలో ప్రవేటుగా టీచర్లను పెట్టుకొని ఇంటి దగ్గరే చదివారు. తరువాత హైస్కూల్ విద్య కోసం శ్రమ విలువల పట్ల గౌరవం నేర్పే “ఋషివ్యాలీ స్కూల్”లో చదివారు. అక్కడ ఎవరి వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలి. ఆ రకంగా శ్రమపట్ల గౌరవం, తన పనులను తానే చేసుకోవాలి అనే దృక్పథం టి.ఎన్.కి అలవడ్డాయి. ఈ లక్షణాన్ని ఆయన తన జీవితంలో తుదికంటా ఆచరించారు.

హైస్కూల్ చదువు ముగిసిన తరువాత టి.ఎన్.ని 1931-32 సం॥లో ఇంటర్మీడియట్ చదువుకోసం ఆయన తండ్రి 'సుబ్బారెడ్డి' మద్రాస్లోని 'లయోలా కాలేజీ'లో చేర్పించాడు. అయితే ఈ కాలేజీలో ఎదురైన తొలి సంఘటనలే టి.ఎన్.కి ఆ కాలేజీ పట్ల సదభిప్రాయాన్ని కలుగచేయలేకపోయాయి. ఋషీవ్యాలీ స్కూల్లో శ్రమకు గౌరవం ఇచ్చేవారు తప్ప కృత్రిమ మర్యాదలకు తావుండేది కాదు. ఈ . వాతావరణం నుంచి వచ్చిన టి.ఎన్. తరగతి గదిలోకి లెక్చరర్ రాగానే లేచి నిలబడాలనే స్పృహను ప్రదర్శించలేదు. మిగతా తన సహ విద్యార్థులు అందరూ అలా చేసినా టి.ఎన్. గమనంలోకి తీసుకోలేకపోయారు. దీన్నే పెద్ద తప్పుగా భావించిన ఆ లెక్చరర్ తీవ్ర స్వరంలో టి.ఎన్.ని మందలించారు. ఈ సంఘటన టి.ఎన్.కి ఆ కాలేజీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించింది.

అయితే నాగిరెడ్డి జీవితాన్ని ప్రభావితం చేసిన ఘటన మాత్రం ఆ కాలేజీలోనే జరిగింది. అధ్యయనం పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచిన సందర్భం ఆ కాలేజీలోనే టి.ఎన్.కు ఎదురైంది. తరగతి గదిలో ప్రొఫెసర్ చరిత్రను బోధిస్తూ మహమ్మద్ బీన్ తుగ్లకన్ను పిచ్చివాడిగా అభివర్ణిస్తూ మాట్లాడారు. అయితే టి.ఎన్.కి ఈ అభిప్రాయం మింగుడు పడలేదు. మహమ్మద్ బీన్ తుగ్లక్ న్ను పిచ్చివాడుగా అభివర్ణిస్తూ, రాయబడినదంతా చరిత్ర వక్రీకరణ మాత్రమే అని ఆయన గట్టిగా విశ్వసించాడు. తన వాదనకు మద్దతుగా అనేక చారిత్రక గ్రంథాలను కూలంకషంగా అధ్యయనం చేశాడు. ఈశ్వర ప్రసాద్ వ్రాసిన 'మధ్యయుగాల చరిత్ర' సహాయంతో.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?