• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Train Your Brain

Train Your Brain By Squadron Leader Jayasimha

₹ 300

కాల్పనిక జ్ఞాపకం (Creative Memory)

జ్ఞాపకశక్తి అంటే ఏమిటి?
(What is Memory?)

మన ఇంద్రియాలతో పొందిన అనుభవమంతా ఒక మనో చిత్రంగా రూపాంతరం చెంది మన మెదడులో నిక్షిప్తమవుతుంది. ఇది మన నరాల నిర్మాణ పద్ధతిలో ఒక భాగం. ఈ మనోచిత్రాలను వర్తమానంలో వెలుగులోకి తీసుకొస్తే, దీన్నే మనం పునరావృత్తం, జ్ఞాపకం అని పిలుస్తాం. జ్ఞాపకమే జీవితం. జీవితమే జ్ఞాపకం. విజ్ఞాన మంతా జ్ఞాపకమే.

మన మెదడులో పొందుపరచబడిన చరిత్రే జ్ఞాపకం. ఒక చిత్రకారుడి వలె, జ్ఞాపకం భూత, వర్తమాన చిత్రాల్ని చిత్రిస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, జ్ఞాపకాలు మెదడులో సృషించబడిన నరాల నమూనాలు. రసాయన బంధంతో ఏర్పరచబడిన నరాల మధ్య ఇవి వారధులు. ఈ రసాయన వారధులు అనేక చర్యలతో ఏర్పరచబడిన వారధులు. ఇది అత్యంత సాధారణ ప్రారంభ ఇంద్రియ లేక ఉద్రేక ఘటన, ఇదే నిక్షిప్త ఘటన పునరావృత్తం అవుతుంది.

సూక్ష్మంగా చెప్పాలంటే, వర్తమానంలోకి తీసుకురాబడిన గతకాల చిత్రమాలికే జ్ఞాపకం. అయితే, దానికంటే, జ్ఞాపకం సరియైన సమయంలో సరియైన సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడం.

మానవ మెదడు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది. ఇది ఎంత సమాచారాన్నైనా, గణాంకాలనైనా చేర్చుకోగలుగుతుంది. హార్డ్ డిస్క కొన్ని పరిమితులుండవచ్చు. మన మెదడుకు ఎటువంటి పరిమితులూ...............

  • Title :Train Your Brain
  • Author :Squadron Leader Jayasimha
  • Publisher :NeelkamalPublications pvt ltd
  • ISBN :MANIMN4350
  • Binding :Papar back
  • Published Date :2022 Reprint
  • Number Of Pages :214
  • Language :Telugu
  • Availability :instock