ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ (1941-1922)
ప్రపంచ ప్రఖ్యాత మార్పిస్టు మేథావి ఐజాజ్ అహ్మద్ నేటి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో 1941లో జన్మించారు. స్వాతంత్య్రానంతరం ఆయన తండ్రి కుటుంబంతో సహా పాకిస్తాన్కు వెళ్లిపోయారు. లా హెూర్లో ఆయన విద్యాభ్యాసం నడిచింది. విద్యార్థిగా ఉన్న సమయంలోనే అక్కడి వామపక్ష రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. ఆయన విద్య నేర్చుకోవడం తరగతి గదుల్లో ఎంత జరిగిందో, అంతే నేర్చుకోవడం పార్టీ శాఖల్లోనూ జరిగింది. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేయడం కూడ అక్కడే మొదలెట్టారు. వామపక్ష రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయిన ఐజాజ్ అహ్మద్ ఆనాటి పాక్పాలకుల దృష్టిలో పడ్డాడు. దీనితో ఆయన విద్యను కొనసాగించేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయారు. 1970ల చివరి వరకు ఆయన అక్కడే ఉండిపోయారు. పలు ఉన్నత విద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. 1970ల ఆరంభం నుండి దక్షిణాసియా పరిణామాలపై 'మంత్లీ రివ్యూ' జర్నల్కు వ్యాసాలు రాయడం ఆరంభించారు.
1980లలో ఆయన భారత దేశానికి వచ్చారు. భారతదేశాన్ని తన మాతృభూమిగా పరిగణించిన ఆయన ఇక్కడే చాలకాలం ఉండిపోయారు. న్యూఢిల్లీలోని పలు కళాశాలల్లోను, విశ్వవిద్యాలయాల్లోను ఆయన బోధించారు. పోస్ట్ మోడర్నిజం, పోస్ట్ కలోనియలిజం, హిందూత్వ, ఉదారవాద విధానాలపై ఆయన కూలంకషమైన అధ్యయనం చేస్తూ, పలు రచనలు చేస్తూ, అనేక ఉపన్యాసాలు కూడ ఇచ్చారు. ఇక్కడి వామపక్ష
భారతదేశం: ఉదార ప్రజాస్వామ్యం, తీవ్ర మితవాదం