వన్నూరమ్మ చరిత్ర పుస్తక రూపం... దాల్చటం వెనుక...
మా స్వగ్రామం తిప్పిరెడ్డిపల్లె. 20 సంవత్సరాల క్రితం నేను జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయాన మా నాన్నగారు వన్నూరమ్మ గురించి ఎక్కువగా చెప్పేవారు. ఆ ప్రేరణతో ఈనాడు దినపత్రికలో నేను రాసిన గుప్త నిధుల కోసం వేట... శిథిలమవుతున్న కోట.... అనే కథనం ప్రచురితమైంది. 2001లో మొట్టమొదటిసారిగా అక్షర రూపంలో మహానాయిక గురించి రాశాను. నల్లమల మన్యంలోని వన్నూరమ్మ కోటను చేరటానికి పెద్దరాళ్ళు, గుంటలు, గోతులతో ప్రయాణం చేయవల్సి వచ్చింది. అడవులలో కనపడు వాగులు, వంకలు, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించాయి. పక్షుల కిలకిలలు, జంతు విన్యాసం, జలపాతాల సవ్వడుల మధ్య ఒక వైపు భయం, మరో వైపు ఆహ్లాదం కలగలసిన ప్రయాణమిది. విభిన్నంగా, కళాత్మకంగా ఉంది. అత్యంత అరుదైనది. 22-09-2020 మానాన్నగారు కాలం చేశారు. దీంతో చెన్నై రాష్ట్రంలో ఉన్న నేను ఉ న్నఫలంగా మైదుకూరుకు వచ్చాను. ఈ సమయంలో కొన్ని కథలు రాశాను. అప్పుడు నేను దాచుకొన్న వన్నూరమ్మ పాత ఫోటోలు చూశాను. దీంతో పాలెపాలిత చరిత్ర గురించి పుస్తకం రాయాలి అని శ్రీ ఈశ్వరీదేవియే నన్ను ఆజ్ఞాపించింది. మొదట్లో చాలామందిని సంప్రదిస్తే నాకు నిరాశే ఎదురైంది. ఎవర్ని అడిగినా మాకు పూర్తి సమాచారం తెలీదనే మాటలు ఎక్కువగా వినిపించాయి. తర్వాత మైదుకూరు మీడియా పెద్దలు, మిత్రులు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. పిదప ప్రముఖ కవి లెక్కల వెంకటరెడ్డిని సంప్రదించాను. నీకు ఆ మహిళ గురించి ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోమన్నారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానమిచ్చేవారు. లెక్కల వెంకటరెడ్డి వన్నూరమ్మ మీద పాట రాసి మాకు ఇచ్చారు. ఈ సమయంలో ప్రముఖ, ప్రఖ్యాత రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో పరిచయం పెరిగింది. కవి కూడా వన్నూరమ్మ మీద నవల రాస్తున్నారు. దీంతో మేము చాలా ప్రదేశాలు తిరిగి విషయాలు సేకరించాం. సన్నపురెడ్డి గారితో ఎప్పుడూ చరిత్రకు పన్నురమ్మ చరిత్ర....................