• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Udyamaala Sikharam Uddaraju Raamam

Udyamaala Sikharam Uddaraju Raamam By U Ramakrishna

₹ 250

అసాధారణ వ్యక్తిత్వంగల గొప్ప నాయకుడు

బి. వి. రాఘవులు

పొలిటా బ్యూరో సభ్యులు, సిపిఐ(ఎం)

ఉద్దరాజు రామం గారు ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం ప్రాంతం, పాలకొల్లు సమీపాన వాలమర్రు గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచాన్ని, భారతదేశాన్ని కుదిపేసిన పరిణామాల మధ్య గడిచింది.

1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం బ్రిటిష్ వలసగా ఉన్న మన దేశాన్ని యుద్ధంలోకి లాగింది. దాని ఆర్థిక, రాజకీయ ప్రభావాలు ప్రజలపై తీవ్రంగా పడ్డాయి. 1917లో రష్యాలో జారిష్టు పాలనను కూల్చి, శ్రామికవర్గ రాజ్యాన్ని స్థాపించిన మొదటి సోషలిస్టు విప్లవం జయప్రదం అయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాపితంగా యువతరంపై పెద్ద ప్రభావాన్ని చూపింది. దేశంలో గాంధీగారి ప్రవేశంతో జాతీయోద్యమం ఒక కొత్త ఊపును అందుకుంది. 1920లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమయింది. 1917 చంపరాన్ సత్యాగ్రహం, 1922 చౌరీచౌరా ఘటన, జాతీయోద్యమంలో రైతాంగ ప్రవేశానికి సంకేతాలయ్యాయి. కొద్దికాలం ఉధృతి తగ్గినా, 1930లో శాసనోల్లంఘన ఉద్యమంతో తిరిగి జాతీయోద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమం ఒక వెల్లువలా దేశాన్ని కుదిపివేసింది. రామంగారు ఈ అసాధారణ పరిస్థితుల్లో పెరిగి పెద్దవారయ్యారు. ప్రభావాలకు గురయ్యారు. చదువుతోపాటు రాజకీయాలలో ఓనమాలు దిద్దుకున్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితానికి మార్గ పథాన్ని నిర్ధేశించుకున్నారు.......................

  • Title :Udyamaala Sikharam Uddaraju Raamam
  • Author :U Ramakrishna
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN6076
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :289
  • Language :Telugu
  • Availability :instock